నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసింహ శతకం
*
సీ॥ పద్మాక్ష! మమతచేఁ బరము నందెదమంచు
విఱ్ఱవీగెదమయ్య వెఱ్ఱినంటి
మాస్వతంత్రంబైన మదము కండ్లకుఁగప్పి
మొగముపట్టదు కామమోహములకు
బ్రహ్మదేవుండైనఁ బైడి దేహముగల్గఁ
జేసివేయక మమ్ముఁ జెఱచెనతఁడు
తుచ్ఛమైనటువంటి తోలెమ్ముకలతోడి
ముఱికి చెత్తలు చేర్చి మూటకట్టె
తే॥ నీ శరీరాలు పడిపోవు టెఱుఁగకేము
కాముకుల మైత్రి మిఁక మిమ్ముఁ గానలేము
భూషణ వికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
*
భావం: ఓ నరసింహస్వామీ! పద్మము వంటి కన్నులు గలవాడా! ప్రేమ వల్లనే స్వర్గమందగలమని భ్రాంతిపడి గర్వించాము - మాకు జన్మసిద్ధమైన అహంకారం కళ్లకు గప్పి, కామమోహాల వల్ల మొగం వాచింది. కనీసం బ్రహ్మదేవుడైనా బంగారు శరీరము ఇవ్వకుండా హేయమైన తోలు ఎముకలు కట్టబెట్టి, మురికిచెత్త మూటకట్టాడు. ఈ తనువులు రాలిపోతాయని తెలీదు. మేము కాముకులం. నిన్ను జూడలేం.