నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసింహ శతకం
*
సీ॥ గరుడవాహన! దివ్యకౌస్త్భులంకార!
రవికోటితేజ! సారంగవదన!
మణిగణాన్వితహేమమకుటాభరణ! చారు
మకరకుండల! లసన్మందహాస!
కాంచనాంబర! రత్నకాంచీవిభూషిత!
సురవరార్చిత! చంద్రసూర్య నయన!
కమలనాభ! ముకుంద! గంగాధరస్తుత!
రాక్షసాంతక! నాగరాజశయన!

తే॥ పతితపావన! లక్ష్మీశ! బ్రహ్మజనక!
భక్తవత్సల! సర్వేశ! పరమపురుష!
భూషణ వికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
భావం: ఓ నరసింహమూర్తీ! నీకు గరుత్మంతుడు వాహనం, కౌస్త్భుం ధరించావు. కోటి సూర్యుల తేజస్సు నీది. సారంగదనుడవు. బంగారు కిరీటం తాల్చావు. మకరకుండలాలు ధరించావు. చక్కని చిరునవ్వుతో, పట్టుపుట్టం, రత్నాల మొలనూలు ధరించి వెల్గుతున్నావు. దేవతలు నిన్నర్చిస్తారు. సూర్యచంద్రులే నీకు కళ్లు. నీ బొడ్డున కమలముంది. నీవు ముకుందుడవు. శివుడు నీ స్తోత్రం చేస్తాడు. రాక్షసుల్ని మట్టుబెట్టావు. ఆదిశేషుడు నీ పడక. పాపుల్ని రక్షిస్తావు. లక్ష్మి నీ యిల్లాలు. బ్రహ్మ నీ కొడుకు. నీవు భక్తవత్సలుడవు. సర్వేశ్వరుడవు. పరమపురుషుడవు - నీకు నమస్కారం.