నేర్చుకుందాం

నరసింహ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ॥ పలుమాఱు దశరూపములు ధరించితివేల?
నేక రూపముఁ బొందవేల నీవు?
నయమున క్షీరాబ్ధి నడుమఁ జేరితివేల?
రత్నకాంచన మందిరములు లేవె?
పన్నగేంద్రుమీఁదఁ బవ్వళించితివేల?
జలతారు పట్టెమంచములు లేవె?
ఱెక్కలు గల పక్షి నెక్కి సాగితివేల?
గజతురంగాందోళికములు లేవె?
భావం: ఓ నరసింహస్వామీ! పది అవతారాలెత్తడమెందుకు? ఒక్క రూపం చాలదా? పాలసముద్రం మధ్యకేల పోయావు? రతనాలు పొదిగిన బంగారు భవనాలు లేవా? పాముపై పవ్వళించావు - జలతారు పట్టెమంచాలు లేవా? పక్షినెక్కావు ఏన్గులు, గుఱ్ఱాలు, పల్లకీలు లేవా ఊరేగడానికి?