నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసింహ శతకం
*
సీ॥ తిరుపతిస్థలమందుఁ దిన్నగా నేనున్న
వేంకటేశుఁడు మేత వేయలేఁడొ?
పురుషోత్తమునకు నేఁ బోయినఁ జాలు జ
గన్నాథుఁడన్నంబుఁ గడపలేఁడొ?
శ్రీరంగమునకునేఁ జేరఁబోయినఁజాలు
స్వామి గ్రాసము పెట్టి సాకలేఁడొ!
కాంచీపురములోనఁ గదిసి నేఁ గొలువున్నఁ
గరివరదుఁడు పొట్ట గడపలేఁడొ?

తే॥ ఎందుఁబోవక నేను నీ మందిరమున
నిలిచితిని నీకు నా మీఁద నెనరులేదు
భూషణ వికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
*
భావం: ఓ నరసింహ ప్రభూ! తిరుపతిలోనే వుంటే వెంకన్న ఇంత తిండిపెట్టేవాడే. పూరీ వెళ్లితే జగవన్నాథుడు పట్టెడన్నం సమకూర్చేవాడే. శ్రీరంగం వెళితే రంగేశుడు గ్రాసమిచ్చి కాపాడేవాడే. కంచికి వెళ్లితే శ్రీహరి నా పొట్టకింద తింటి పెట్టేవాడే. ఎక్కడికి పోయినా నా పూట గడుస్తుంది. అయితే నేను ఎక్కడికీ పోకుండా నీ మందిరానే్న కాచుక కూర్చున్నా. నా మీద దయలేదు నీకు.