నేర్చుకుందాం

నేర్చుకుందాం -- నరసింహ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ॥ అమరేంద్రవినుత! నే నతిదురాత్ముడ నంచుఁ
గలలోనగైనను కనులఁబడవు
నీవు ప్రత్యక్షమై నిలువకుండిన మానె
దొడ్డగా నొక యుక్తి దొరకెనయ్య!
గట్టి కొయ్యను దెచ్చి ఘనముగా ఖండించి
నీ స్వరూపము జేసి నిలుపుకొందు
ధూపదీపములిచ్చి తులసితో పూజించి
నిత్య నైవేద్యముల్ నీమముగను

తా: ఓ ప్రభూ! నీవు ఇంద్రునిచే స్తుతింపబడినవాడవు. నేను మిక్కిలి చెడ్డవాడనని భావించి నాకు కలలో కూడ కన్పించకున్నావు. నీవు కన్పించకపోతే పోనీ నాకొక ఉపాయం తట్టింది. గట్టి కర్రనొక దాన్ని తెచ్చి, నీ రూపం చెక్కి నా యెదుట బెట్టుకుని దానికి ధూపదీపాలు, నిత్య నైవేద్యాలు సమర్పిస్తూ మనసారా కొలుస్తాను. మంచి లోకమే దొరికింది. ఇంతే చాలు-