నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. దేవతలన్ జయించుచు నతిస్థిరసంపదలం ద్వదీయవి
ద్యావిభవంబు పెంపునన దానవు లుద్ధతులైరి; కానినాఁ
డీవనరాశిలోఁ జొరరె యింతకు నంతకకోవులైన య
ద్దేవవతాకినీపతుల దివ్య నిశాత మహాయుధాహతిన్

భావం: నీ విద్య యొక్క మహత్త్వం వల్లనే దేవతలను జయిస్తూ మిక్కిలి స్థిరమైన సంపదలతో రాక్షసులు గర్వం కలవారైనారు. కానిచో యముడి కోపం వంటి కోపం కలవారైన ఆదేవతా సేనాపతుల దివ్యమైనవి, వాడి అయినవి గొప్ప ఆయుధాల దెబ్బల చేత ఈ సముద్రంలో ప్రవేశించి ఉండరా! అంటే మరణించి ఉండరా..అని భావం. మీవల్లనే రాక్షసలోకం సుఖంగా సంచరిస్తోందని మీరు లేకపోతే అనాథలై పోతారని చెప్పుతూ మీరు మీ కూతురుకొచ్చిన కోపం పోగొట్టి మీరిద్దరూ ఎప్పటివలె ఇక్కడనే ఉండండి అని వృషపర్వుడు శుక్రుడిని బతిమాలుతున్నాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము