నేర్చుకుందాం

నేర్చుకుందాం( నరసింహ శతకం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ॥ ఫణుల పుట్టలమీదఁ బవ్వళించినయట్లు
పులుల చోటుల జేరఁ బోయినట్లు
మకరి వర్గంబున్న మడుగుఁ జొచ్చినయట్లు
గంగదాపున నిండ్లు గట్టినట్లు
చదలభూమిని మంచి చాపఁబరచినట్లు
ఓటు బిందెలఁబాలనుంచినట్లు
వెఱ్ఱివానికి బహువిత్తమిచ్చిన యట్లు
కమ్మగుడిసెల యందుఁ గాల్చినట్లు
తే॥ స్వామి! నీ భక్తవరులు దుర్జనుల తోడఁ
జెలిమి చేసినట్లయ్యినఁ జేటు వచ్చు
భూషణ వికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భావం: ఓ నరసింహ స్వామీ! పాములున్న పుట్టలపై పడుకొన్నట్లు, పులులున్న గుహలోనికి చొచ్చినట్లు, మొసళ్లుండే చెరువులో దూకినట్లు, గంగ ఒడ్డున ఇల్లు కట్టుకున్నట్లు, చెదలున్న నేలపై చాపపరచినట్లు, తాటిపాకలో మందుసామగ్రి కాల్చినట్లు, నీ భక్తులు దుర్జనులతో చెలిమి చేస్తే ప్రమాదం తప్పదు.