నేర్చుకుందాం

నేర్చుకుందాం( నరసింహ శతకం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ॥ కూర్మావతారమై కుధరంబు క్రిందను
గోర్కెతో నుండవా కొమరు మిగుల!
వరహావతారమై వనభూములనుజొచ్చి
శిక్షింపవా హిరణ్యాక్షు నపుడు!
నరసింహమూర్తివై నరభోజను హిరణ్య
కశిపునిఁద్రుంపవా క్రాంతిమీర!
వామనరూపమై వసుధలో బలిచక్ర
వర్తినణంపవా వైరమూని!
తే॥ ఇట్టి పనులెల్లఁ జేయఁగా నెవ్వరికిని
దగును నరసింహ! నీకె గాఁదగును గాక!
భూషణవికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భావం: ఓ నరసింహస్వామి! కూర్మావతారుడవై మందర పర్వతం క్రిందనున్నావు. వరహావతారుడవై సముద్రానఁజొచ్చిన హిరణ్యాక్షుని శిక్షించావు. నరసింహావతారుడవై హిరణ్యకశిపుని చంపావు. వామనుడవై బలిచక్రవర్తిని పాతాళానికి అదిమావు. ఈ పనులన్నీ చేయడానికి నీకు గాక ఇంకెవరికి చెల్లు? (ఎవ్వరికీ సాధ్యంకాదు.)