నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసింహ శతకం

సీ॥ అమరేంద్రవినుత! నిన్ననుసరించినవారు
ముక్తిఁబొందిరి వేగ ముదముతోడ
నీ పాదపద్మముల్ నెఱ నమ్మియున్నాను
నాకు మోక్షంబివ్వు నళిననేత్ర!
కాచి రక్షించు నన్ గడతేర్చు వేగమే
నీ సేవకునిఁ జేయు నిశ్చయముగఁ
గాపాడినను నీకుఁ గైంకర్యపరుఁడనై
చెలఁగి నీ పనులను జేయువాఁడ
తే॥ ననుచుఁ బలుమాఱు వేడెద నబ్జనాభ!
నాకుఁ బ్రత్యక్షమగు నినె్న నమ్మినాను
భూషణవికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భావం: ఓ నరసింహ ప్రభూ! నీవు దేవేంద్రునిచే స్తుతింపబడ్డవాడవు. నిన్ననుసరించే వారు వెంటనే మోక్షాన్ని పొందారు. నినే్న నమ్ముకున్నాను. నాకూ ముక్తిని ప్రసాదించు. నన్ను చేరదీసి నీ దాసుని చేసుకో. అప్పుడు నన్ను నీకే అర్పించుకుని నీ సేవలే చేస్తాను. నిన్ను ఎన్నిమార్లయినా ప్రార్థిస్తాను. సాక్షాత్కరించు తండ్రీ! నినే్న నమ్ముకున్నాను.