నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసింహ శతకం

సీ॥ శేషప్ప యనుకవి చెప్పిన పద్యముల్
చెవుల కానందమై చెలఁగుచుండు
నే మనుజుండైన నెలమి నీ శతకము
భక్తితో విన్న సత్ఫలము గలుగుఁ
జెలఁగి రుూ పద్యముల్ చేర్చి వ్రాసినవారు
కమలాక్షుకరుణను గాంతురెపుడు
నింపుగాఁబుస్తకం బెపుడు పూజించిన
దురితజాలంబులు దొలగిఁపోవు
తే॥ నిద్ది పుణ్యాకరంబని యెపుడు జనులు
కష్టమనక పఠించినన్ గలుగు ముక్తి
భూషణవికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భావం: శ్రీ నరసింహప్రభూ! శేషప్ప అనే కవి వ్రాసిన పద్యాలు చెవులకింపు గొల్పుతాయి. ఎవ్వరైనా ఈ శతకాన్ని భక్తితో వింటే మంచి ఫలితం కల్గుతుంది. ప్రీతితో దీన్ని కూర్చి వ్రాస్తే శ్రీహరి కృపకు సదా పాత్రులవుతాడు. పూజచేస్తే బాధలన్నీ తొలగిపోతాయి. పుణ్యప్రదమైన ఈ శతకకృతిని నిత్యం పఠిస్తే ముక్తి సిద్ధిస్తుంది.