నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాశరథి శతకం

ఉ.శ్రీ రఘురామ చారుతులసీదలదామ శమక్షమాదిశృం
గారగుణాభిరామ త్రిజగన్నుతశౌర్యరమాలలామ దు
ర్వారకబంధరాక్షసవిరామ జగజ్జనకల్మషార్లవో
త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.

భావం: సంపత్ప్రదమయిన రఘు మహారాజు జన్మించిన ఇక్ష్వాకు వంశంలో జన్మించి, భద్రాచల క్షేత్రంలో నివసించి ఉన్న దయా సముద్రుడవగు ఓ దశరథరామా, నీవు సుందరమైన తులసీ దళమాలను ధరించినవాడవు. శాంతము, ఓర్పు అనే మనోహర గుణములు గలవాడవు. స్వర్గ మర్త్య పాతాళ లోకములలో పొగడబడిన పరాక్రమ లక్ష్మికి అలంకారమైనవాడవు. ఎదిరించడానికి సాధ్యం కాని కబంధుడనే దుష్ట రాక్షసుని సంహరించినవాడవు. సముద్రం వంటి అపారమైన జనుల పాపాలను దాటింపజేసే సామర్థ్యం కలవాడవు.
వ్యాఖ్యానము: దాశరథి శతకాన్ని రచించిన రామదాసుగా ప్రఖ్యాతిని పొందిన కంచెర్ల గోపన్న తన శతకాన్ని శ్రీ అనే అక్షరంతో ప్రారంభించినాడు. కావ్య ప్రారంభం శ్రీకారంతో చేయడం తెలుగు కవి సంప్రదాయం. తెలుగు సాహిత్యంలో ఆదికవి నన్నయభట్టు తన ఆంధ్ర మహాభారతాన్ని ‘శ్రీవాణీగిరిజాశ్చిరాయ’ అని ప్రారంభించినాడు. నన్నయకు దీటైన తిక్కన సోమయాజి ‘శ్రీయన గౌరినాబరగు’ అనే శ్రీకారానే్న ప్రారంభంలో ఉపయోగించినాడు. శ్రీ అంటే సంపద, లక్ష్మి, సమృద్ధి, శుభము మొదలైన అర్థాలున్నాయి. ‘అనిర్వేదః శ్రీయో మూలమ్’ అని రామాయణంలో వున్నది. శ్రీ అనే అక్షరాన్ని దేవతలకు, గౌరవింపదగిన వ్యక్తులకు ముందు ఉపయోగిస్తారు. తెలుగువారు సామాన్యంగా ‘శ్రీరాముడు’ అనే కాని రాముడు అని వ్యవహరించరు.