నేర్చుకుందాం

నేర్చుకుందాం( దాశరథి శతకం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ.రామ, విశాలవిక్రమపరాజితభార్గవ రామ, సద్గుణ
స్తోమ, పరాంగనావిముఖసువ్రతకామ, వినీలనీరద
శ్యామ, కకుత్స్ద వంశకలశాంబుధిసోమ, సురారిదోర్బలో
ద్దామవిరామ, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: రామా, సుందర స్వరూపం గలవాడవు. భార్గవ వంశంలో జన్మించిన పరశురాముని జయించినవాడవు. మంచి గుణముల సమూహము కలవాడవు. పరస్ర్తిల యందు ఆసక్తి లేనివాడవు. ఇంపైన నల్లని మేఘము వంటి శరీర కాంతి కలవాడవు. సూర్య వంశమైన కాకుత్స్దవంశమనే సముద్రానికి చంద్రుని వలె ఆహ్లాదం కలిగించేవాడవు. రాక్షసుల బాహుబలాన్ని అణచినవాడవు. భద్రాచలరామా, దశరథరామా.
వ్యా.అయోధ్యా నగరంలో శ్రీరాముడు జన్మించడం చేత అయోధ్యారాముడు, దశరథుని కుమారుడు కావడం చేత దశరథ రాముడని శ్రీరాముని వ్యవహరించడం ఉన్నది. కాని, కంచెర్ల గోపన్న శ్రీరాముని భద్రగిరి రాముడనే ఆద్యంతం సంబోధించినాడు. భద్రాచలంలో ఆయన నివసించి ఉండడం చేత ఈ సంబోధన సముచితమే.
ఈ పద్యంలో అనుప్రాస అనే శబ్దాలంకారం నిక్షిప్తమైంది. మకారం అంత్యప్రాసగా నిలిచి పద్యానికి శబ్ద సౌందర్యం సమకూర్చింది.
‘కకుత్స్ద వంశ కలశాంబుధిసోమ’ అన్నప్పుడు రూపకం అనే అర్థాలంకారం ఉపయుక్తమైంది.