నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ.అగణిత సత్యభాష, శరణాగతపోష, దయాలసజ్‌ఝరీ
విగతసమస్తదోష, పృథివీసురతోష, త్రిలోకపూతకృ
ద్గగనధునీమరందపదకంజవిశేష, మణిప్రభాధగ
ద్ధగితవిభూష, భద్రగిరిదాశరథీ, కరుణాపయోనిధీ
భావం: అసామాన్యమైన, గణించుటకు సాధ్యంకాని, సత్యవాక్యములు మాటాడువాడవు. అభయమును కోరినవారిని, శరణువేడిన వారిని, కాపాడువాడవు. ప్రకాశించే ప్రవాహం వంటి స్వచ్ఛమైన దయాగుణం చేత, ఆశ్రీతుల దోషాలను పరిహరించేవాడవు. బ్రాహ్మణులను సంతోషింపచేసేవాడవు. మూడు లోకాలను పవిత్రం చేసే గంగానదిని వెలువరించిన పాదపద్మాలు గలవాడవు. రత్నముల కాంతుల చేత ధగధగ మెరుస్తూ ఉన్న ఆభరణములు ధరించినవాడవు. భద్రాచల నివాసియగు దశరథరామా!
వ్యాఖ్యానం: ఈ పద్యంలో కవి శ్రీరాముని గుణవిశేషాలను వర్ణించి ఆయన గొప్పతనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. లోకంలో సత్యవాక్పరిపాలన చేసేవాడుండవచ్చు గాని, శ్రీరాముని సత్యవాక్యం ఇంతటిది అని ఎన్ని చెప్పడానికి సాధ్యం కానిది. శత్రువైనను సరే, శరణు వేడితే కాపాడే గుణం కలిగినవాడు. ఆయన దయాగుణం స్వచ్ఛమైన నీటి ప్రవాహం వంటిది. దానిచేత లోకంలోని మనుష్యుల, భక్తుల పాపాలు పోగొట్టే శక్తి కలిగినవాడు. వేదాభ్యాసం చేసి, నియమ వ్రతాలను పాలించే బ్రాహ్మణులను సంతోషపెట్టేవాడు. శ్రీరాముని పాదాలు పవిత్రమైనవి. గంగానదిలో స్నానం చేస్తే పాపాలు తొలగి పోతాయంటారు. శ్రీరాముని పాదాల నుంచి గంగానది జన్మించటం చేత, ఆయన పాదాలు స్పృశిస్తే చాలు భక్తుల దోషాలన్ని నశిస్తాయి. మహారాజు కాబట్టి అనేక రత్నాలంకారాలు ధరించినాడు. అవి ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటాయి.