నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాశరథి శతకం
*
ఉ. రంగదరాతిభంగ ఖగరాజతురంగ విపత్పరంపరో
త్తుంగతమఃపతంగ, పరితోషితరంగ, దయాంతరంగ, స
త్సంగ, ధరాత్మజాహృదయసారసభృంగ, నిశాచరాబ్జమా
తంగ శుభాంగ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ
భావం : విజృంభించిన శత్రువుల గర్వాన్ని అణచేవాడవు. గరుత్మంతుని వాహనంగా చేసికొన్నవాడవు. అంధకారము వలె వరుసగా వచ్చే (ఆశ్రీతుల) ఆపదలను సూర్యుని వలె తొలగించేవాడవు. శ్రీరంగనాథుని సంతోషపెట్టినవాడవు. దయతో నిండిన మనస్సు గలవాడవు. సత్పురుషుల చేత సేవింపబడేవాడవు. సీతాదేవి హృదయమనే పద్మానికి తుమ్మెద లాంటివాడవు. అనగా ఆమె మనస్సులో పరిభ్రమించేవాడవు. దుష్టులైన రాక్షసులను సంహరించేవాడవు. మంచి శరీర లక్షణములు గలిగినవాడవు. భద్రాచలంలో నివసించే దశరథరామా!
వ్యా: శ్రీరాముని స్తుతిపూర్వకంగా సంబోధన చేస్తూ చెప్పబడిన పద్యమిది.
లోకంలో అతిశయించి విజృంభించిన శత్రువులను సంహారం చేయడానికే శ్రీవిష్ణుమూర్తి శ్రీరాముడుగా అవతరించాడు. బ్రహ్మదేవుని వరాలతో రావణబ్రహ్మ మదించి భూలోకానే్న కాక స్వర్గ పాతాళాలను కూడ సతమతం చేస్తున్నాడు. ఈ బాధకు దేవతలు, మానవులు సహించలేకుండా ఉన్నారు. దశరథ మహారాజుకు సంతానం కలిగి, ఆ సంతానం వలన రావణ సంహారం జరిగితే ఉభయ తారకంగా ఉంటుంది. బ్రహ్మకు తాను రావణాసురునికి ఇచ్చిన వరాలు జ్ఞాపకం ఉన్నాయి. నరవానరుల వల్ల రావణుడు రక్షణ కోరలేదు. కాబట్టి దశరథునికి అటువంటి సంతతిని ప్రసాదిస్తే సమస్య తీరిపోతుంది. బ్రహ్మ ఆలోచనకు విష్ణువు స్పందిస్తాడు. ఆమోదిస్తాడు. తాను దశరథ నందనుడిగా జన్మిస్తానని చెప్తాడు. దేవతలు, ఋషులు సంతోషిస్తారు.