నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాశరథి శతకం
*
ఉ.శ్రీద, సనందనాదిమునిసేవితపాద, దిగంతకీర్తి సం
పాద, సమస్త్భూతపరిపాలనవినోద, విషాదవల్లికా
చ్ఛేద ధరాధినాథకులసింధుసుధామయపాద, నృత్తగీ
తాదివినోద, భద్రగిరి దాశరథీ, కరుణాపయోనిధీ.
*
భావం: సంపదలనిచ్చువాడవు. సనకుడు సనందనుడు మొదలైన ఋషుల చేత సేవించబడి పూజింపబడేవాడవు. విస్తృతమై దిక్కుల చివరి వరకు వ్యాపించిన కీర్తి గలవాడవు. లోకములోని అన్ని ప్రాణులను కాపాడేవాడవు. (్భక్తులు, ఆశ్రీతుల) దుఃఖమును పోగొట్టేవాడవు. (ప్రాణులు అడవిలో ఉండే చెట్ల తీగల వంటి దుఃఖాల్లో ఇరుకుకొని బయట పడలేకపోతే, ఆ దుఃఖమనే తీగలను ఖండించి వారి దుఃఖాన్ని పోగొట్టేవాడు రాముడు). క్షత్రియ వంశమనే జలధికి చంద్రుని వంటివాడవు. ఆటపాటల యందు వేడుక కలవాడవు. భద్రాచలంలో నివసించే దశరథ రామా!
వ్యా: ఈ పద్యంలో శ్రీరాముని విష్ణుమూర్తిగా భావించి కవి స్తుతి చేసినాడు.
విష్ణుమూర్తి లక్ష్మీదేవికి భర్త. ఆమెను సర్వదా వక్షఃస్థలంలో ధరించి ఉంటాడు అని అనేక పురాణాలు చెబుతూ వున్నవి. శ్రీకాంతుడు అని విష్ణుమూర్తి పేర్లలో ఒకటి. శ్రీ అనే పదానికి, ధనము, వైభవము, సమృద్ధి, రాజత్వము, ఉన్నత పదవి, సౌందర్యము, లక్ష్మీదేవి, అలంకారము మొదలైన అనేకార్థాలున్నాయి.
విష్ణుమూర్తి అనగా శ్రీరాముడు, శ్రీకి, అనగా పైన చెప్పిన వాటికన్నింటికి అధీశుడు కాబట్టి సంపద మొదలైన వాటిని అనుగ్రహించేవాడు. శ్రీరాముని సేవించేవారికి సంపదలకు కొదువలేదని కవి భావము.