నేర్చుకుందాం

నేర్చుకుందాం( దాశరథి శతకం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ.ఆర్యులకెల్ల మ్రొక్కి వినతాంగుఁడనై రఘునాథభట్టరా
చార్యులకంజలెత్తి కవిసత్తములన్ వినుతించి కార్యసౌ
కర్యమెలర్ప నొక్క శతకంబొనఁగూర్చి రచింతు నేఁడు తా
త్పర్యమునన్ గ్రహింపుమిది దాశరథీ కరుణాపయోనిధీ
భావం: నేను వినయముతో పెద్దలకందరికి నమస్కరించి, మా గురువులైన రఘునాథ భట్టరాచార్యుల వారికి చేతులు జోడించి మ్రొక్కి, పూర్వ కవులను స్తుతిచేసి, నేను చేసే రచన సుకరముగా- సులభముగా - నెరవేరగా, ఇపుడు శతకమనే కావ్యాన్ని వ్రాస్తున్నాను. కరుణా సముద్రుడవైన ఓ భద్రాచలరామా, ఈ శతకాన్ని మంచి అభిప్రాయంతో స్వీకరించుము.
వ్యా: కంచెర్ల గోపన్నకు రఘునాథ భట్టరాచార్యుల వారు గురుపాదులైనట్లు ఈ పద్యంలో తెలియవస్తున్నది. మరొక పద్యంలో ‘పట్టితి భట్టరార్యగురుపాదము’ను అని కూడ చెప్పియున్నాడు. దాన్నిబట్టి భట్టరాచార్యుల వారు కవికి విశిష్టాద్వైత సిద్ధాంతమును బోధించిన గురువు అని తెలియవస్తున్నది. ఈ ఆచార్యల వారిని గురించి చారిత్రకమైన విశేషాలు మనకంతగా తెలియవు. భట్టరాచార్యుల వారు గోపన్నకు తిరుమంత్రోపదేశం చేసి సమాశ్రయణమొనర్చి విశిష్టాద్వైత సిద్ధాంత బోధ చేసినట్టివాడు అని భావించడం సముచితం.