నేర్చుకుందాం

నేర్చుకుందాం -- దాశరథి శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ.మసకొని రేగుబండ్లకును వౌక్తికముల్ వెలబోసినట్లు దు
ర్వ్యసనము జెంది కావ్యము దురాత్ములకిచ్చితి మోసమయ్యె నా
రసనకుఁబూతవృత్తి సుకరంబుగఁ జేకురునట్లు వాక్సుధా
రసములు చిల్క పద్యముఖరంగమునందు నటింపవయ్య సం
తసమునుజెంది భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: రేగుపండ్లు తినడానికి ఆశపడి, వాటి బదులు మంచి ముత్యాలు ఇచ్చి ఆ పండ్లు కొని తినినట్లుగా, దుష్టమైన అలవాట్లకు లోనై, దురాశకు లోనై, మోసపోయి నా కావ్యాన్ని దుష్టబుద్ధులైన వారికి అంకితమిచ్చినాను. ఈ అపరాధానికి నాకు ఇపుడు పశ్చాత్తాపం కలిగింది. ఓ భద్రాచల దశరథరామా, ఇపుడు నీవు నా నాలుకకు, తప్పు చేసిన దానికి, పవిత్రభావం చేకూడేవిధంగా, పద్యం వ్రాస్తున్న నా ముఖరంగంలో, నోటిలో సంతోషంతో నటింపుమా. అట్లా చేస్తే నా నాలుక పవిత్రం అవుతుంది. నాకు మంచి పద్యం వస్తుంది. అమృతం వంటి వాక్కును, మాటను నాకు కలిగింపుము.
వ్యా: ఈ పద్యంలో కవి ఆత్మనిర్వేదం ఉన్నది. కంచెర్ల గోపన్నకవి పూర్వం ఒక మంచి కావ్యం వ్రాసినట్లున్నాడు. దానిని, ధన వ్యామోహంలోపడి, దురాత్ముడైన ధనవంతునికో రాజుకో అంకితం చేసినట్లున్నాడు. దానివలన అతనికి పశ్చాత్తాపం కలిగింది. అందుచేత, తొలగించుమని తన ఇష్టదైవమయిన శ్రీరాముని వేడుకొంటున్నాడు. ఇంకొకని పేరు మీదుగా కావ్యం వ్రాయడం చేత అతని నాలుకకు దోషం కలిగింది. మోసం కలిగింది. దానికి తిరిగి పవిత్రతను కలిగించుమని విన్నవించుకొన్నాడు. పద్యము ఇతరుల పేర పేర్కొన్నప్పుడు, అతని పేరు తన ముఖరంగంలో ప్రవేశింపక తప్పదు కదా. అటువంటి నోటిలో తిరిగి రాముడు నటింపవలెనని ప్రార్థిస్తున్నాడు.