నేర్చుకుందాం

నేర్చుకుందాం( దాశరథి శతకం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ.శ్రీరమణీయహార యతసీకుసుమాభశరీర, భక్త మం
దార, వికారదూర, పరతత్త్వవిహార, త్రిలోకచేతనో
ద్ధార, దురంతపాతకవితానవిదూర, ఖరాదిదైత్యకాం
తారకుఠార, భద్రగిరి దాశరథీ, కరుణాపయోనిధీ.

భావం: లక్ష్మీదేవి యొక్క కాంతిచేత మనోజ్ఞమైన హారములు దాల్చి, అవిసెపూవు వంటి సుకుమారమైన, అందమైన శరీరకాంతి గలవాడవు. నిన్ను సేవించు భక్తుల కోర్కెలు నెరవేర్చేవాడవు. కాబట్టి కల్పవృక్షం లాంటివాడవు. పరమాత్ముడవై అవతారాదిలీలలలో విహరించేవాడవు. స్వర్గమర్త్యపాతాళములనే మూడు లోకాల్లో ఉండే ప్రాణులను, పతనం కాకుండా కాపాడేవాడవు. మానవులు చేసే అనంతమైన పాపాలను దూరం చేసేవాడవు. తొలగించేవాడవు. పదునాల్గువేల పదునాల్గుమంది ఖరదూషణాది రాక్షసులనే దట్టమైన అడవికి గొడ్డలిలాంటి వాడవు. అనగా వారందరిని నిశే్శషం చేసినవాడవు. భద్రాచలంలో నివసించే దయాసముద్రమైన దశరథరామా.

వ్యా: శ్రీ అనగా, లక్ష్మి, సంపద, ఐశ్వర్యము, త్రివర్గము, వృద్ధి, శోభ, అలంకరణము, కీర్తి, బుద్ధి, సరస్వతి అనే అర్థాలున్నాయి. విష్ణుమూర్తి స్వరూపుడైన శ్రీరాముని కంఠహారము సుందరమైంది. ఎందుచేతనంటే, అది లక్ష్మీదేవితో కూడింది. లక్ష్మీదేవిని ఆయన వక్షఃస్థలంలో ధరించి ఉంటాడు కాబట్టి, లక్ష్మిని ధరించినవాడు కాబట్టి సంపదను ధరించినట్టే లెక్క. ఐశ్వర్యమన్నా అదే అర్థము. త్రివర్గమంటే ధర్మార్థ కామములు. శ్రీరాముడు తన వక్షఃస్థలంలో తన భక్తులకు ఈ త్రివర్గాన్ని దర్శింపచేయడం చేత, ఆయన హారం మనోజ్ఞంగా ఉన్నది. శ్రీరాముని వక్షఃస్థలంలో ఉండే హారం భక్తులకు వృద్ధికారకమైంది. అది శోభతో కూడినట్టిది, హారాన్ని అలంకారం కొరకు ధరించినాడు. కాబట్టి ఆ అర్థం కూడ సముచితంగా ఉన్నది. ఇన్ని గుణాలు కలిగిన హారం, శ్రీరాముడు కంఠంలో ధరించింది. రమణీయంగా అంటే ఒప్పిదంగా ఉన్నది.