నేర్చుకుందాం

నేర్చుకుందాం--దాశరథి శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ.దురితలతాలవిత్ర, ఖరదూషణకాననవీతిహోత్ర, భూ
భరణకళావిచిత్ర, భవబంధ విమోచన సూత్ర, చారుని
స్ఫురదరవిందనేత్ర, ఘనపుణ్యచరిత్ర, వినీలభూరికం
ధరసమగాత్ర, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: తీగల వంటి పాపసంచయాన్ని కొడవలివలె నరికివేసేవాడును, అగ్ని దట్టమైన అడవిని కాల్చివేసినట్లుగా ఖరదూషణులను నాశనం చేసినవాడును, నానావిధముల లీలల చేత భూభాగాన్ని అద్భుతంగా వహించినవాడును, భక్తులకు కలిగిన జన్మపరంపరల నుండి విముక్తి కలిగించేవాడును, సుందరమైన పద్మాల్లాంటి సోగకన్నులు గలవాడును, మిక్కిలి పావనమైన నడవడియందు ప్రవర్తిల్లినవాడును మబ్బు వంటి సుందరమైన నల్లని శరీర వర్ణం కలవాడును, భద్రగిరిలో నివసించేవాడును నైన శ్రీ దశరథరామా.
వ్యా: ఈ పద్యం కూడా సంబోధనాత్మకమే.
మనుష్య జన్మ ఎత్తిన తరువాత పాపాలు సంక్రమించకుండా ఉండవు. ఈ పాపాలను కవి తీగలతో పోల్చినాడు. ఒకసారి తీగలో చిక్కుకొంటే, క్రమంగా దానిలో ఇరుకుకొని పోవడమే కాని బయటపడడం ఉండదు. భగవంతుని అనుగ్రహమే ఆ చిక్కు నుంచి బయటపడే మార్గం. పాపాల్లో చిక్కిన అహల్యను, తన దర్శనంతో విముక్తి కానించినాడు శ్రీరాముడు.
వీతిహోత్రుడు అంటే అగ్ని. హవిస్సు ఆహారంగా గలవాడని అర్థం. ఖరదూషణులు చాల సైన్యంగలవారు. చాల బలవంతులు కూడ. శూర్పణఖ మాట విని శ్రీరామునిపై దండెత్తి వచ్చి ఆయన బాణాలతో అసువులు కోల్పోయారు. ఈ కథ ఇదివరకే వచ్చింది. దట్టమైన అడవిలాంటి ఖరదూషణులకు, వారి సైన్యానికి రాముడు అగ్నిలాగ పరిణమించి వారిని నిర్మూలించినాడని కవి సూచించినాడు.