నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాశరథి శతకం
*
ఉ.శ్రీరఘువంశతోయధికి శీతమయూఖుఁడవైన నీ పవి
త్రోరుపదాబ్జముల్ వికసితోత్పలచంపకవృత్తమాధురీ
పూరితవాక్ప్రసూనములఁ బూజలొనర్చెదఁ జిత్తగింపుమీ,
తారకరామ, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: చంద్రుడు తాను పుట్టిన సముద్రాన్ని వర్థిల్లచేసిన విధంగా, రఘుమహారాజ వంశమున బుట్టి దానిని వృద్ధి చేసినవాడవైన నీ పవిత్రపాదారవిందములను ఉత్పలము, చంపకము అనే పుష్పాలతో పూజించిన విధంగా, శబ్దాలతో కూడిన చంపకమాల, ఉత్పలమాల అనే పద్యాలతో పూజిస్తున్నాను. భద్రాచలంలో నివసించి, దయాసముద్రుడవైన, సంసారమును తరింపచేసే రామా, దానిని స్వీకరింపుము.
వ్యా: కంచెర్ల గోపన్నకవికి తన ఇష్టదైవమైన శ్రీరాముని పాదాలను అర్చించవలెననే కోరిక కల్గింది. భక్తుడైన వానికి భగవంతుని సేవించే సహజమైన కోరిక ఇది. కాని, ఏ అర్చామూర్తినో కాక, మన్ఫఃలకంపై నివసించి ఉండిన శ్రీరామమూర్తిని అర్చించే కోరిక ఇది. అందుచేత లోకంలో భక్తులు, కలువలు, సంపెంగలు తీసుకొని వెళ్లి శ్రీరామ పాదాలను అర్చించినట్లుగానే ఉత్పలమాల, చంపకమాల అనే పద్యాలతో ఆయన పాదాలను పూజిస్తామనే వాంఛ కలిగింది. విచిత్రంగా ఈ పద్యాలకు పూవుల పేర్లే ఉన్నాయి. శార్దూలమత్త్భాలు అనే వృత్తాలు గ్రహించి ఉంటే వాటిని పుష్పాలతో ఉపమించే అవకాశం ఉండేది కాదు. తన శతకాన్ని, అర్చనావిధిగా వ్రాస్తున్నాను అనే మాటను కవి ఈ పద్యంలో సూచించి ఉన్నాడు. పూజల్లో వాక్పూజ కూడ ఒకటి.