నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాశరథి శతకం
*
చ.హరునకు నవ్విభీషణున కద్రిజకుం దిరుమంత్రరాజమై
కరికి నహల్యకున్ ద్రుపదకన్యకు నార్తిహరించు చుట్టమై
పరగినయట్టి నీ పతితపావననామము జిహ్వపై నిరం
తరము నటింపఁజేయుమిఁక దాశరథీ కరుణాపయోనిధీ.
*
భావం: ఓ దశరథరామా, త్రిమూర్తులలో ఒకడైన మహేశ్వరునికి, రావణుని సోదరుడైన విభీషణునికి, మహేశ్వరుని అర్ధాంగియైన పార్వతీదేవికి, మహేశ్వరుని అర్ధాంగియైన పార్వతీదేవికి, శ్రేష్ఠమైన మంత్రమైనది. నీ పవిత్రమైన నామము. అట్లే, ఏనుగులకు అధీశుడైన గజేంద్రునికి, గౌతమసతియైన అహల్యకు పాండవపత్నియైన ద్రౌపదీదేవికి ఆత్మబంధువువలె వ్యథలను తొలగించేది నీ పేరు. అది పతితులను ఉద్ధరించేది. పవిత్రం చేసేది. అటువంటి నీ రామ నామాన్ని ఎల్లప్పుడు నా నాలుక మీద ఆడునట్లు చేయుమా. అనగా నేనెల్లపుడు నీ పేరు ఉచ్చరించే అవకాశాన్ని కలిగింపుమని భావం.
*
వ్యా: దాశరథీ శతకాన్ని రచించిన కంచెర్ల గోపన్న కవి గొప్ప వైష్ణవుడు. భక్తుడు. శ్రీమన్నారాయణుని సర్వదా స్మరించుకొనేవాడు. ఈ విశేషాలు ఈ పద్యం ద్వారా చక్కగా వ్యక్తమైనాయి.
మోక్షప్రాప్తికి ప్రపత్తిని మించిన సాధనము లేదని పరమభాగవత సిద్ధాంతము. సాధకుడు సర్వేశ్వరునకు తన్ను సమర్పించుకోవడమే ప్రపత్తియోగము. దీనికి శరణాగతి యని ప్రసిద్ధమైన పేరు. త్యాగము, న్యాసము, భరన్యాసము, సన్యాసము, సాధ్యభక్తి - మొదలైనవి దీనికే పర్యాయాలు. సర్వశ్రేష్ఠమైన ఈ ప్రపత్తి దర్శనం వేదము, ఉపనిషత్తులు, ఆగమశాస్త్రం, పురాణాలు, మహాభారతం (భగవద్గీత) మొదలైన ప్రామాణిక గ్రంథాలన్నింటిలోను ప్రతిపాదితమైంది. బ్రహ్మ, శివుడు, నారదమహర్షి, కపిలాచార్యుడు, ప్రహ్లాదుడు, భీష్ముడు, అర్జునుడు మొదలైన పలువురు దీన్ని అనుష్ఠించినారు. శ్రీవైష్ణవ సిద్ధాంతానికి ప్రపత్తిమార్గం జీవగర్ర.