నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాశరథి శతకం
*
ఉ.ముప్పునఁ గాలకింకరులు ముంగిట నిల్చినవేళ, రోగముల్
గొప్పరమైనచో గఫము కుత్తుకనిండినవేళ, బాంధవుల్
గప్పినవేళ, మీస్మరణ గల్గునొ, గల్గదొ నాటికిప్పడే
తప్పక చేతు మీభజన, దాశరథీ, కరుణాపయోనిధీ.
*
భావం: ఓ దశరథ రామా, నాకు వార్ధక్యమేర్పడి (ముసలితనం వచ్చి) నప్పుడు నేనున్న చోటికి మరణసమయంలో యమదూతలు వచ్చినప్పుడు, రోగములు అతిశయించినప్పుడు, అంతిమ సమయంలో గొంతులో శే్లష్మము (తెమడ) నిండియున్నప్పుడు, చివరి క్షణాల్లో బంధువులు చుట్టుముట్టుకొని ఉన్నప్పుడు, మిమ్ములను నేను స్మరించడం సంభవిస్తుందో లేదో, అంటే అవయవాలు స్వాధీనంలో లేనప్పుడు భజన చేయడం సాధ్యం కాదని భావం. అందుచేత, ఇప్పుడే నిన్ను తప్పక సేవింతును, భజన చేతును.
*
వ్యా: శతకకవులు చాలామంది కవిత్వం వ్రాసేటప్పుడు ఆత్మాశ్రయంగా వ్రాయడం ఉన్నది. కవి తన అనుభూతులను, ఇతరుల అనుభూతులకు సరిసమానంగా చెప్పగా, పాఠకులకు, కవిలాంటి అనుభూతి కలిగితే దాన్ని ఆత్మాశ్రయత్వమని విమర్శకులు భావిస్తారు. కవి తన వృత్తాంతం చెప్పుతూనే ఇతరుల వృత్తాంతం చెప్పినట్టి నేర్పు ఇది. ఇక్కడ కంచెర్ల గోపన్న, తాను వృద్ధుడై, తనకు అంతిమ సమయం ఆసన్నమైనప్పుడు, తన ఇష్టదైవమయిన శ్రీరాముని భజన చేయడానికి, నామస్మరణ చేయడానికి అవకాశం ఉంటుందో లేదో అని సందేహించి, ఆ సేవ ఇప్పుడే, అంటే అవయవాలు స్వాధీనంలో ఉన్నప్పుడే చేస్తాను అని తన స్థితిని పరమాత్మునికి నివేదిస్తున్నాడు.
అందుచేత దేహంలో శక్తి ఉన్నప్పుడే ఈశ్వరధ్యానం చేయండి అని ధ్వని ప్రధానంగా సూచిస్తున్నాడు కవి. తన గోడు వినిపిస్తూనే ఇతరులకు ప్రబోధం చేసే రమణీయ పద్ధతి ఇది.