నేర్చుకుందాం

నేర్చుకుందాం -- దాశరథి శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ.పండిత రక్షకుం డఖిల పాపవిమోచనుఁడబ్జసంభవా
ఖండలపూజితుండు దశకంఠవిలుంఠనచండకాండకో
దండకళాప్రవీణుఁ డగుతానకకీర్తివధూటికిత్తుఁ బూ
దండలు గాఁగ నాకవిత, దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: కరుణా సముద్రుడవైన దశరథరామా, ‘పండితులను రక్షించువాడు, సమస్త పాపాలను తొలగించువాడు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలగు వారిచేత పూజింపబడేవాడు, రావణాసురుని తలలు దునుమునట్టి వాడి బాణములు వేయనేర్చిన విలువిద్యయందు నేర్పరియైనవాడు’ అనెడు నీ కీర్తికి నా కావ్యమనే పూలదండను సమర్పింతును.
వ్యా: రామదాసు అని ప్రఖ్యాతి పొందిన కంచర్ల గోపన్నగారు, తాను దాశరథీ శతకం అనే కావ్యాన్ని శ్రీరామునికి సమర్పణ చేయసంకల్పించి ఈ పద్యం వ్రాసినాడు. ఈ శతకంలో నూటమూడు పద్యాలున్నాయి. ఒక్కొక్క పద్యాన్ని ఒక్కొక్క పుష్పంగా భావిస్తే, ఇది ఒక పూలదండ అయింది. ఈ పద్యాలలో భక్త్భివం పుష్పాల్లో దారంలాగ దీని ఏకీభావానికి కారణమైంది. కవిగారికి తన కావ్యం ఉత్తమమైంది, సుందరమైంది అనే విశ్వాసం ఉన్నది. అందుచేతనే దాన్ని పూలదండలాగ భావించి సమర్పిస్తానని అంటున్నాడు.
భక్తులు తమ ఇష్టదైవమైన భగవంతునికి అర్చాపూర్వకంగా పూలదండలు కానుకలుగా సమర్పించడం సంప్రదాయంగా ఉన్నది. పూర్వం పెరియాళ్వారు అనే విష్ణుచిత్తుడు విష్ణుమూర్తికి మాలాకైంకర్యం చేసేవాడు. అంటే పూలచెట్లను పెంచి, వాటి పూలను మాలలుగా కూర్చి విష్ణుమూర్తికి సమర్పించి తన జన్మను సార్థకం చేసుకున్నాడు.