నేర్చుకుందాం

నేర్చుకుందాం( దాశరథి శతకం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ.శ్రీరమ సీతగాఁగ నిజసేవకబృందము వీరవైష్ణవా
చార జనంబుగాఁగ విరజానదిగౌతమిగా వికుంఠము
న్నారయ భద్రశైల శిఖరాగ్రముగాఁగ, వసించుచేనో
ద్ధారకుఁడైన విష్ణుఁడవు, దాశరథీ, కరుణాపయోనిధీ!

భావం: భద్రాచలాన్ని కంచెర్ల గోపన్నకవి వైకుంఠంగా భావించి వర్ణిస్తున్నాడీ పద్యంలో.
ఓ దశరథ రామా, నీవు పరమపదమందున్న సంపత్ప్రదయైన లక్ష్మీదేవిని ఇచట సీతాదేవిగా చేసికొని, ఆ పరమపదంలో ఉండే నీ పరివారం ఇచట విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అనుసరించే ఆచార్య జనంగా కొలుస్తూ ఉండగా, అచట ఉండే విరజానది ఇచటి గోదావరిగా ప్రవహించగా, ఆ వైకుంఠమే ఇచటి భద్రాచలంలోని కొండకొమ్ము కొనగా రాణింపగా, నీవు వేంచేసి, ప్రాణులను, జీవులను ఉద్ధరిస్తున్న శ్రీ విష్ణుమూర్తివేకాని, వేరు కావు.
వైకుంఠ నగరాన్ని మనస్సులో పెట్టుకొని కవి భద్రాచలాన్ని ఇచట వర్ణిస్తున్నాడు. వైకుంఠ నగరంలో లక్ష్మీదేవి ఉంటుంది. ‘అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోత్పల పర్యంకరమా’ అని కదా. అందుచేత భద్రాచలంలో ఉండే సీతాదేవి రమాదేవియే. వైకుంఠంలో సనకసనందనాదులు, ఆర్య జనులున్నారు. వీరు విష్ణుమూర్తి సాన్నిధ్యంలో ఉంటారు. ఇక భద్రాచలంలోని శ్రీరాముని సన్నిధిలో విశిష్టాద్వైత సంప్రదాయ ప్రవర్తకులున్నారు. ఇతర భక్తజనులు ఉన్నారు. వైకుంఠంలో విరజానది ఉన్నది. భద్రాచలంలో గోదావరి నది జీవనదిగా ప్రవహిస్తున్నది. అందుచేత, భద్రాచలం అనే కొండకొమ్ము వైకుంఠ నగరం లాంటిదే. ఇక వైకుంఠంలో విష్ణుమూర్తి శ్రీరాముడే.