నేర్చుకుందాం

నేర్చుకుందాం( దాశరథి శతకం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ.హలికునకున్ హలాగ్రమున వర్థము చేకురుభంగి, దప్పిచే
నలమట జెందువానికి సురాపగలో జలమబ్బినట్లు, దు
ర్మలినమనోవికారినగు మర్త్యుని నన్నొడగూర్చి నీపయిన్
దలపు ఘటింపజేసితివి దాశరథీ కరుణాపయోనిధీ.

భావం: ఓ దయాసముద్రుడవైన దశరథరామా, మడి దున్నుకొని జీవితము గడిపే కర్షకునికి, నాగలికొర్రుకు ధనరాశి తగిలి లభించిన విధంగాను, దాహంతో అలసట చెంది బాధలో ఉన్నవానికి గంగానదిలోని నీరు దొరకినట్లుగాను, మాలిన్యముకలిగి, దోషభూయిష్ఠమైన మనస్సు కలిగిన మానవుడనైన నన్ను చక్కచేసి, నీపయి మనస్సు కలిగించి, భక్తి కలిగించి ధన్యుని చేసితివి కదా.

వ్యా: కవి శ్రీరాముని మీద, తన దైవం మీద కృతజ్ఞతతో చెప్పినటువంటి పద్యం ఇది. దీనిలో ఆత్మీయభావం సర్వదా వ్యక్తం అవుతూ వున్నది. ఆయన జీవిత విశేషాలు కూడా ధ్వన్యాత్మకంగా కనిపిస్తూ ఉన్నవి. దమ్మక్క నిరాడంబరంగా ఏర్పాటు చేసిన మండపంలో ఉండే భద్రాచల రాముని చూసినప్పుడు ‘కంటిని భద్రనగాధివాసమున్’ అనే పద్యం చెప్పినట్లుగానే, ఆ రాముని దర్శించిన తరువాత లోక సామాన్యంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి జీవితం గడిపే కంచెర్ల గోపన్నగారికి జీవితంలో గొప్ప మార్పు సంభవించిన అనుభూతి కలిగింది. ఆ అనుభూతిని పురస్కరించుకొనియే ఈ పద్యం వ్రాసి ఉన్నాడు.