నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాశరథి శతకం
*
ఉ.కొంజక తర్కవాదమను గుద్దలిచేఁ బరతత్త్వభూస్థలిన్
రంజిలఁద్రవ్వి కన్గొననిరామనిధానము, నేఁడు భక్తి సి
ద్ధాంజనమందు హస్తగతమయ్యె ‘్భళీ’ యనఁగా మదీయ హృ
త్కంజమునన్ వసింపుమిఁక దాశరథీ కరుణాపయోనిధీ.
*
భావం: దశరథరామా, భూమిని గుద్దలి అనే సాధనం చేత, ఎంత త్రవ్వినా కనిపించని నిధి, సిద్ధుని వలన లభించిన అంజనముచే, అంటే కాటుకచేత, లభించిన విధంగా, భగవంతుని గూర్చిన తర్కవాదాల చేత ఎంత పరిశీలించినా, వెదకినా అంతుతెలియని రాముడవగునీవు. భక్తిచేత సులభముగా నాకు వశమయినావు. ప్రశంసాపూర్వకంగా లభించినావు. ఇంక నీవు నా హృదయంలో వసింపుమా.
*
వ్యా: కొంజు అంటే సందేహించు, సంకోచించు అనే అర్థాలున్నాయి. ఇది ఆధునిక భాషలో ప్రయోగించబడటంలేదు. ఆంధ్ర మహాభాగతంలో దశమస్కంధంలో ఈ పదమిట్లా ఉపయోగింపబడింది.
అంజక బాలకుఁడనియును - గొంజక దయమాలి రాజకుంజర యంతన్
గుంజరమును డీకొలిపెను - గుంజరపాలకుఁడు గోపకుంజరుమీఁదన్
తర్కము అనే పదానికి ఊహ, అధ్యాహారము, కారణము, కోరిక, ఒక శాస్తమ్రు అనే అర్థాలున్నాయి. కారణం మీద వాదించే ఒక శాస్తమ్రు అని అర్థం గ్రహించవచ్చు. నియమన గ్రంథాన్ని శాస్త్రం అంటారు. దీనిని ఆరు రకాలుగా విభజించారు. 1.తర్కము 2.వ్యాకరణము 3.్ధర్మము 4.మీమాంస 5.వైద్యము 6.జ్యోతిషము
శాస్తబ్రద్ధంగా వాదాలు చేసి భగవంతుని కనుగొనుట సాధ్యంకాదని భావం. పరతత్త్వం అంటే పరమాత్మ - పురుషుడు, పంచవింశతితత్త్వాలు, అష్టప్రకృతులు, షోడశవికారాలు - ఇవన్ని పురుషుని గురించి చెబుతాయి.