నేర్చుకుందాం

నేర్చుకుందాం - దాశరథి శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ.రాముఁడు ఘోరపాతకవిరాముఁడు, సద్గుణకల్పవల్లికా
రాముఁడు, షడ్వికారజయరాముఁడు, సాధుజనావనవ్రతో
ద్దాముఁడు, రాముఁడే పరమదైవము మాకని మీయడుంగుఁగెం
దామరలే భజించెదను, దాశరథీ కరుణాపయోనిధీ.

భావం: సకల జనులను ఆనందింపచేసేవాడు, ఘోరమైన పాపాలను తొలగించేవాడు, కల్పవృక్షం తీగలలాంటి మంచి గుణాలకు ఉద్యానం లాంటివాడు, జన్మ, జర, మొదలైన ఆరు మానవ సహజమైన వికారాలను జయించినవాడు, మంచివారిని, సజ్జనులను రక్షించడమనే వ్రతాన్ని ఆచరించడంలో శ్రేష్ఠమైనవాడు, అతడే శ్రీరాముడు. ఓ దశరథ రామా అతడే నీవు. అటువంటివాడు మాకు ఉన్నతదైవము, పరమాత్మ అని భావించి, పద్మాల్లాంటి మీ పాదాలను కీర్తించి సేవిస్తాను.

వ్యా: ఈ పద్యంలో తనకు పరమాత్మగా భాసించిన శ్రీరాముని భక్తితో స్తుతి చేస్తున్నాడు కవి కంచెర్ల గోపన్న. భక్తిలో నవవిధాలున్నాయి. వాటిలో స్తుతి లేక కీర్తన అనేది ఒకటి. తన భక్తిని వెల్లడించడానికి, తన మనస్సులోని భావాలను నివేదించుకోవడానికి భక్తుడైన కవి ఈ పద్యంలో కీర్తనను మాధ్యమంగా ఉపయోగించుకొన్నాడు. శ్రీరాముని గుణగణాలను వర్ణిస్తూ అతడు ‘రాముడు’ అంటే రమింపచేసేవాడు అని. పాపాలను పోగొట్టేవాడని, మంచి గుణాలకు స్థానమని, ఆరు వికారాలు జయించినవాడని, సజ్జనులను కాపాడే శ్రేష్ఠమైన వ్రతం కలవాడని, అతనిని కొనియాడినాడు. ఇన్ని మంచి లక్షణాలున్న శ్రీరాముడు అతనికి పరమ దైవమైనాడు. అందుచే అతని ఎర్రని పద్మాల్లాంటి పాదాలను ఎప్పుడూ భజిస్తానని తన కోరికను వ్యక్తం చేసినాడు.