నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాశరథి శతకం
*
ఉ.చక్కెరమాని వేము దినఁజాలినకైవడి, మానవాధముల్
పెక్కురు బక్కదైవముల వేమరు గొల్చెదరట్లకాదయా
మ్రొక్కిన నీకు మ్రొక్కవలె; మోక్షమొసంగిన నీవ రుూవలెన్
దక్కినమాటలేమిటికి, దాశరథీ కరుణాపయోనిధీ.
*
భావం: మానవులలో హీనులైనవారు, శ్రీరాముడవైన నిన్ను వదలి, క్షుద్ర దేవతలను అనేకులైన వారిని సేవిస్తారు. ఇది ఎట్లున్నదంటే, తీయని రుచి కలిగిన చక్కెరను వదలిపెట్టి చేదు పదార్థమును తినునట్టిదే. (తీయని పదార్థాన్ని తినడానికి అభ్యాసం అక్కరలేదు. కానీ చేదు పదార్థాన్ని తినడానికి నేర్పు, అభ్యాసం కావలె) ఇది సరియైన పద్ధతి కాదు. దైవంగా భావించి నీకే నమస్కారం చేయవలె. ముక్తిని కైవల్యాన్ని ప్రసాదించేవాడవు నీవే. ఇతర దైవాల వలన ముక్తి లభించదని భావం.
*
వ్యా: విశిష్టాద్వైత సంప్రదాయంలో విష్ణుమూర్తి తప్ప ఇతర దైవతములు మోక్షమును ప్రసాదించలేరు అని చాలా చోట్ల చెప్పబడింది. కృష్ణ్భగవానుడు భగవద్గీతలో ఇదే విషయాన్ని తన భక్తునికి ఆదేశించినాడు.
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః
ఇక్కడ సర్వధర్మాలు, అంటే ఇతర దైవతాలను కొలువడం అని విజ్ఞులు వ్యాఖ్యానిస్తారు. కంచెర్ల గోపన్న కవి ఈ చరమశ్లోకాన్ని స్మరించుకొంటూనే ఈ పద్యం వ్రాసినాడనిపిస్తుంది. ‘పెక్కురుబక్కదైవముల’ కొలవకుండా ఉండడమే సర్వధర్మ పరిత్యాగము. ‘మ్రొక్కిన నీకు మ్రొక్కవలె’ అనడం ‘మామేకం శరణం వ్రజ’ అనడంలోని భావం. ‘మోక్షయిష్యామి మాశుచః’ అనే విషయాన్ని ‘మోక్షమొసంగిన నీవ రుూవలెన్’ అని కవి ఉద్ఘాటించినాడు.