నేర్చుకుందాం

నేర్చుకుందాం -- దాశరథి శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ.రామ హరే కకుత్థ్సకుల రామ హరే రఘురామ రామ శ్రీ
రామ హరే యటంచు మది రంజిల భేకగళంబులీల నీ
నామము సంస్మరించినజనంబు భవంబెడబాసి తత్పరం
ధామనివాసులౌదురఁట దాశరథీ కరుణాపయోనిధీ.

భావం: ఓ దశరథరామా, రామ, హరే, కాకుత్థ్సరామా, రఘురామా, శ్రీరామా, హరే అనేవి నీ పేర్లు. ఈ నీ నామములను మానవులు కప్పగొంతువలె మాటిమాటికి తలంచువారు ఇంక జన్మములు ఎత్తే అవస్థను దాటి పరమపదమందు నివసిస్తారట గదా.

వ్యా: ఈ పద్యంలో కవి రామనామ స్మరణము మోక్షమార్గమునకు దారి అనే విషయాన్ని సూచిస్తున్నాడు. రామ నామాన్ని స్మరించే భక్తుల నామోచ్చారణ భేకగళంబువలె ఉంటుందని ఉపమించినాడు. వర్షకాలం వచ్చినప్పుడు, చెరువులు గుంటలు సమృద్ధిగా నీటితో నిండినప్పుడు అంతవరకు భూమి బొరియలలో నిద్రావస్థల్లో ఉండిన కప్పలు, వర్షజలాన్ని చూచి హర్షించి బెకబెక చప్పుళ్లు ఎడతెగకుండా చేస్తాయి. అట్లాగా శ్రీరామభక్తి కలిగిన జనులు తమ మనస్సులో రామస్మరణ నిరంతరాయంగా చేస్తారు. శ్రీరాముని భక్తులు శ్రేష్ఠులు. వారిని కప్పగొంతుకలతోను, రామశబ్దాన్ని బెకబెక చప్పుళ్లతోను కవి పోల్చినప్పుడు ఇతడు నీచోపమను గ్రహించినాడా అనే సందేహం కలుగక మానదు. కాని, వర్షపాతానికి కప్పలు హర్షించి కూసినట్లుగానే, శ్రీరాముని భక్తికి జనులు సంతసించి స్మరిస్తరని కవిభాగంగా గ్రహించవలె. శ్రీరామ నామోచ్చారణ, స్మరణమని మహత్త్వం తెలియని భక్తులు, అంతగా జ్ఞానం లేనివారు కూడ శ్రీరాముని నామస్మరణ చేసి తరించిన సందర్భాలున్నాయి.