నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాశరథి శతకం
*
ఉ.చక్కెరలప్పకున్ మిగుల జవ్వనికెంజిగురాకుమోనికిన్
జొక్కపుజుంటితేనియకుఁ జొక్కిలుచుంగనలేరు గాక నేఁ
డక్కట! రామనామ మధురామృతమానుకంటె సౌఖ్యమా
తక్కిన మాధురీ మహిమ! దాశరథీ కరుణాపయోనిధీ.
*
భావం: దశరథరామా! లోకంలోని జనులు చక్కెర రాశికి, వనంలో ఉన్న సందరమైన స్ర్తిల చిగురాకు వంటి ఎర్రని పెదవులకు, తేనెటీగలు గూర్చిన అచ్చమైన తేనెకు, అనగా వాటి రుచికి, పరవశించి, మైమరిచి, ఆనందించి, రామనామములోని మాధుర్యమును తెలుసుకొనలేకున్నారు. అమృతం వలె అతిభోగ్యమైన రామనామాన్ని ఆస్వాదించడం కంటె, తక్కిన వాటి మాధుర్యాతిశయాలు సుఖప్రదం కానేరవు. రామనామమే అన్నింటికంటె మధురమైంది.
*
వ్యా: ఈ పద్యంలో లౌకికమైన ఆనందాలు అనుభవిస్తున్న సామాన్య జనులు, ఆ మధురమైన వస్తువుల మోహంలో పడి, రామభక్తిని విస్మరించి, ఆముష్మిక సౌఖ్యానికి దూరం అవుతూ ఉన్నారని, భక్తితో శ్రీరామ నామాన్ని ఉచ్చరించడంలో ఉండే సౌఖ్యం స్ర్తి సంపర్కాదులలో లేదని కవి ప్రబోధం చేస్తున్నాడు. భారతీయ సంస్కృతి ప్రకారం ఆధ్యాత్మిక చింతనయే మానవునికి ముఖ్యమైంది. ఆదిశంకరులు ‘భజగోవిందం భజగోవిందం - గోవిందం భజ మూఢమతే’ అని ప్రబోధించడం ఇటువంటిదే.
కంచెర్ల గోపన్న గొప్ప భక్తుడు. నిరంతరం రామనామ ధ్యానం చేసి తరించినవాడు. ప్రాపంచిక సౌఖ్యాలు మోహంలో పడడం సముచితం కాదని చెప్పడంలో ఔచిత్యం ఉన్నది.