నేర్చుకుందాం

నేర్చుకుందాం -- దాశరథి శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ.అండజవాహ, నిన్ను హృదయంబున నమ్మినవారి పాపముల్
కొండలవంటివైన వెసఁగూలి నశింపక యున్న, సంతతా
ఖండలవైభవోన్నతులు గల్గక మానునె? మోక్షలక్ష్మి కై
దండ యొసంగకునె్న తుద, దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: ఓ పక్షి వాహనా, విష్ణుమూర్తీ, శ్రీరామా, మనస్సులో నిన్ను నమ్మిన వారికి కొండల వంటి గొప్పవైన, కఠినమైన ఎన్ని కష్టాలు కలిగినప్పటికీ, ఎన్ని పాపాలు సంభవించినప్పటికి, అవి నశింపక మానవు. తప్పక మాసిపోతాయి. తరువాతి పరిణామంగా, నిన్ను విశ్వసించిన వారికి, ఇంద్రుని గొప్పదైన విభవమువలె, ఐశ్వర్యమువలె, మహైశ్వర్యము కలుగుతుంది. చివరన మోక్షమనే లక్ష్మీదేవి అతన్ని వరిస్తుంది. అంటే జన్మరాహిత్యం సంభవిస్తుంది.
వ్యా: పక్షివాహనుడైన విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముని త్రికరణశుద్ధిగా విశ్వసించిన వారికి సర్వదోషాలు తొలగిపోతాయని, చివరకు మోక్షం లభిస్తుందని కవి ఈ పద్యంలో వ్యక్తం చేసినాడు. ఈ పద్యం కవి స్వానుభవపూర్వకంగా వ్రాసినట్లు కన్పిస్తుంది. ఆ వృత్తాంతం చూడవలసిందే.
రామనామ భక్తి రసాన్ని వెల్లివిరియించే రామదాసు కీర్తనలను, దాశరథీ శతకాన్ని రచించిన భక్తిశిఖామణి వాగ్గేయకారుడు కంచెర్ల గోపన్న. క్రీ.శ.1620-1687 సంవత్సరాల నడుమ గోలకొండ రాజ్యాన్ని పరిపాలించిన కుతుబ్షాహి వంశస్థులైన అబ్దుల్లా, అబుల్‌హసన్ తానాషాకు మంత్రిత్వం నెరపిన అక్కన్న, మాదన్నగార్లు గోపన్నకు మేనమామలు. వారి ద్వారా ఆయనకు భద్రాచలం తహశీల్దారు పదవి లభించింది. ఆ తర్వాతి కథ తెలిసిందే.
ఈ శతకకర్త తన కథను అందరి కథల్లాగా చెప్పే నేర్పు కలవాడు. దీనినే సాహిత్య పరిభాషలో ఆత్మాశ్రయత్వం అంటారు. అధికారం రావడం, దాని ప్రేరణ చేత దోషాలు చేయడం, భగవద్ధ్యానం వలన ఆ దోషాలు మాసిపోవడం ప్రతి మానవుని జీవితంలో సామాన్యమైనవే.