నేర్చుకుందాం

నేర్చుకుందాం( దాశరథి శతకం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ.చిక్కని పాలపై మిసిమి జెందిన మీగడ పంచదారతో
మెక్కిన భంగి మీవిమలమేచకరూపసుధారసంబు నా
మక్కువపళ్లెరంబున సమాహితదాస్యమనేటి దోయిటన్
దక్కెనటంచు జుర్రెదను దాశరథీ కరుణాపయోనిధీ

భావం: చిక్కని పాలను కాచినప్పుడు, దానిమీది మిసమిసలాడే మీగడను చక్కెరలో కలిపి తిన్నవిధంగా, అమృతరసంలాగా ఉండే స్వచ్ఛమైన నీ నల్లని రూపాన్ని నేను ప్రేమతో స్వీకరించి, దాస్యరూపమైన కైంకర్యం చేసి తనివితీర అనుభవిస్తాను.

వ్యా: శ్రీరాముని త్రిజగన్మోహన రూపాన్ని సందర్శించగా కలిగే ఆధ్యాత్మికానందాన్ని, తృప్తిని కవి ఈ పద్యంలో ఒక భౌతికమైన అనుభవంతో పోల్చి దాన్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చెబుతున్నాడు. పాలమీగడ పంచదారతో కలిపి దోసిలి నిండా తింటే ఎంతటి తృప్తి కలుగుతుందో (్భతికంగా) శ్రీరాముని సుందర మనోహర శ్యామలరూపాన్ని దర్శించినప్పుడు ఆయన భక్తునికి, ఈ కవికి అంతటి తృప్తి కలుగుతున్నదట. మధుర పదార్థాన్ని భుజించినప్పుడు ఒక విధమయిన మత్తు కలుగడం అందరికీ అనుభవమే. అదే విధంగా పుంసాం మోహనరూపుడైన శ్రీరాముని దర్శించినప్పుడు భక్తునికి అటువంటి మత్తు, పారవశ్యం కలుగుతుందని కవి వక్కాణిస్తున్నాడు.
ఈ పద్యంలో కవి భక్తితో, ‘దాస్యమనేటి దోయిటన్’ శ్రీరాముని మేచక రూపసుధారసంబును జుర్రుతానని చెబుతున్నాడు. తాను భగవంతుని సేవించడానికి దాస్యం అనే దాన్ని సాధనంగా చేసుకొన్నానని చెప్పినట్లున్నది. భగవంతుణ్ణి సేవించడానికి నిర్దేశింపబడిన నవవిధ భక్తి మార్గాల్లో దాస్యం ఒకటి. పూర్వం పన్నిద్దరాళ్వారుల్లో ఒకరైన విప్రనారాయణుడు నారాయణునికి మాలాకైంకర్యం చేసి, కైవల్యాన్ని పొందినాడు. అటులే, ఆళ్వారుల్లో ముఖ్యుడైన పెరియాళ్వారు - ఆయనే విష్ణుచిత్తుడు - కూడా దాస్యమార్గాన్ని అవలంబించినవాడే.