నేర్చుకుందాం

నేర్చుకుందాం( దాశరథి శతకం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ.హలకులిశాంకుశధ్వజశరాసన శంఖ రథాంగ కల్పకో
జ్జ్వలజలజాత రేఖలను సాంకములై కనుపట్టుచున్న మీ
కలితపదాంబుజద్వయము గౌతమపత్ని కొసంగినట్లు నా
తలఁపునఁజేర్చి కావఁగదె దాశరథీ కరుణాపయోనిధీ

భావం: నాగేలు, వజ్రాయుధము, అంకుశము, జెండా, ధనుస్సు, శంఖము, చక్రము, కల్పవృక్షము, ప్రకాశించే పద్మము వంటి రూపాలతో ఉండే మీ పాదారవిందములు, వాటి వలన గౌతముని పత్నియైన అహల్యకిచ్చి ఆమె జడ రూపాన్ని మార్చి కాపాడినావు కదా. ఆ విధంగానే నా మనస్సులో నీ పాదపద్మాలను కూర్చి నన్ను రక్షించుమయ్యా ఓ దశరథ రామా.

వ్యా: విష్ణుమూర్తి భక్తుడు ఎల్లప్పుడు తన దైవము పాద పద్మాలను స్మరించుకోవడమనేది విశిష్టాద్వైత సంప్రదాయం. భగవన్నామాంకితమైనవి. నారాయణాత్మకమైనవి అయిన రెండు వాక్యాలు ద్వయం అనే పేరుతో వైష్ణవులు నిరంతరం ధ్యానించుకొని విష్ణుమూర్తి పాదాలను ఆశ్రయిస్తారు. దానివలన వారికి కైవల్యం లభిస్తుందని విశ్వసిస్తారు. పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుని గురించి శ్రీమద్భావగతంలో ఈ విధంగా చెప్పబడినది.

పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీ
లానిద్రాదులు సేయుచున్ దిరుగుచున్ లక్షింపుచున్ సంతత
శ్రీనారాయణపాదపద్మ యుగళీచింతామృతాస్వాద సం
ధానుండై మరచెన్ సురారిసుతుఁడేతద్విశ్వమున్ భూవరా.