నేర్చుకుందాం

నేర్చుకుందాం( దాశరథి శతకం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ.్భండనభీముఁడార్తజనబాంధవుఁడుజ్జ్వల బాణతూణకో
దండకళా ప్రచండ భుజతాండవకీర్తికి రామమూర్తికిన్
రెండవపాటిదైవమిఁక లేఁడనుచున్ గడకట్టి భేరికా
డాండడడాండడాండనినదంబులజాండము నిండ మత్తవే
దండమునెక్కి చాటెదను, దాశరథా కరుణాపయోనిధీ

భావం: ఓ దశరథ రామా! శ్రీరాముడు శత్రువులకు యుద్ధంలో భయంకరుడు. భక్తులకు, కష్టాల్లో ఉన్నవారికి చుట్టము వంటి ఆప్తుడు. బాణములును, అమ్ములపొదులును ప్రకాశించే విలువిద్య నెరపే తీవ్రమైన భుజముల కదలికలోని నేర్పుచేత, లాఘవంచేత పొగడ్తగన్న శ్రీరామచంద్రునకు, సాటిదైవము మరిఒకరు లేరనుచు, బ్రహ్మాండమదిరి పోయేటట్లుగా, డాండాం అనే భేరీ ధ్వని చేస్తూ మదించిన ఏనుగును ఎక్కి సర్వప్రపంచంలో ప్రకటిస్తాను.

వ్యా: ఈ పద్యంలో కవికి శ్రీరామునిపైగల భక్తి విశ్వాసములు అనన్యమైనవి అనే భావాన్ని ప్రకటన చేసినాడు. శ్రీరాముని గుణగణాలను కూడ ఈ పద్యంలో వర్ణించినాడు.
శ్రీరాముడు భండన భీముడు - అంటే యుద్ధంలో భయంకరమైనవాడు అనేది సామాన్యార్థం. భీముడు అంటే శివుడు అనే అర్థం కూడా ఉన్నది కాబట్టి, శివుడు తన యుద్ధంలో సర్వశత్రువులను ఏ విధంగా నాశనం చేస్తాడో శ్రీరాముడు కూడ అంతటి భయంకర యుద్ధం చేసి శత్రుసంహారం చేస్తాడని కవి సూచన. శ్రీరాముని చరిత్రయే శరణాగత వాత్సల్యం. ఆయన తన జీవితంలో ఎంతమంది శరణు వేడిన వారిని రక్షించినాడో లెక్కలేదు. ఉదహరణకు అహల్యాదేవిని శాపవిముక్తను జేసినాడు. సుగ్రీవుని కాపాడి ఆయనకు రాజ్యాన్ని ఇప్పించినాడు. అన్నచేత అవమానాల పాలై దేశ బహిష్కారం పొందిన విభీషణునికి లంకారాజ్యం ధారాదత్తం చేసినాడు. ఇంకా మరెందరినో. చివరకు ఆర్తుడైన గోపన్నను చెరసాల విముక్తుని గావించలేదా? అందుకే ఆయన ఆర్తజన బాంధవుడు.