నేర్చుకుందాం

నేర్చుకుందాం( దాశరథి శతకం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ.ఘోరకృతాంతవీరభటకోటికి గుండెదిగుల్, దరిద్రతా
కారపిశాచసంహరణకార్యవినోది, వికుంఠమందిర
ద్వారకనాటభేది, నిజదాసజనావళికెల్లప్రొద్దు నీ
తారకనామమెన్నుకొన దాశరథీ, కరుణాపయోనిధీ

భావం: ఓ దశరథ రామా, సంసార భారం నుండి తరింపచేసే నీ పేరు, భయంకరులైన యముని దూతలకు గుండెలు అదరజేస్తుంది. దయ్యంలాగ మనుష్యులను బాధించే దారిద్య్రం అనే దాన్ని పోగొట్టి ఆనందిస్తుంది. ఎల్లప్పుడు నీ దాసులు, భక్తులు పరమపదానికి పోతున్నప్పుడు కలిగే ఆటంకాలను తొలగిస్తుంది. అంటే మోక్షాన్ని సంపాదించి పెడుతుంది.

వ్యా: మనుష్యుడు ఈ లోకంలో పుణ్యకార్యాలు చేస్తే, మరణం తరువాత స్వర్గసౌఖ్యాలు అనుభవిస్తాడని, పాపం చేస్తే యమదండన నరకంలో అనుభవించవలసి వస్తుందని మన ప్రాచీన గ్రంథాల్లో చెప్పబడి ఉంటుంది. అందుచేత మానవుడీ లోకంలో సచ్ఛీలంతో ప్రవర్తించాలని పెద్దలు చెబుతారు. కాని, తెలిసో తెలియకో, మనుష్యుడు పాపం చేసినా, యముని బాధ నుండి తప్పించుకోవడానికి సంసార బాధల నుండి తప్పింపచేసే రామనామం, భగవన్నామం కాపాడుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. రామభక్తుడైన ఈ కవి కూడ అదే మాటను ఉద్ఘాటిస్తున్నాడు.
పిశాచంలాంటి దారిద్య్రాన్ని భగవానుడు ఎట్లా పోగొట్టుతాడో అనే దానికి నిదర్శనగా కుచేలుని వృత్తాంతం శ్రీమద్భాగవతంలో ఉన్నది.
శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల భౌతికమైన, ఆధ్యాత్మికమైన సుదాముని దారిద్య్రం నశించింది.
హరిభక్తి కలిగిన భక్తుడు శ్రీహరిని స్మరించి తరించే మార్గాన్ని, ప్రహ్లాదుడు అనుసరించిన పద్ధతి శ్రీమద్భాగవతంలో వర్ణింపబడింది.