నేర్చుకుందాం

నేర్చుకుందాం - దాశరథి శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ.పెంపను దల్లివ కలుషబృందసమాగమ మొందకుండ ర
క్షింపను దండ్రివై మెయి వసించు దశేంద్రియరోగముల్ నివా
రింపను వెజ్జవై కృపగురించి పరంబు దిరంబుగాఁగ స
త్సంపదలియ్య నీవె గతి దాశరథీ కరుణాపయోనిధీ
భావం: ఓ దశరథ రామా, పోషించడానికి తల్లి వలెను, దోషాలను, పాపాలను పొందకుండ రక్షించడానికి తండ్రి వలెను, శరీరములోని పది అవయవాలలో కలిగే రోగాలను తొలగించడానికి వైద్యుని వలెను, శుభప్రదములైన సంపదలను అనుగ్రహించడానికి, మోక్షమును స్థిరం చేయడానికి నాకు నీవే దిక్కు.
వ్యా: మానవుని జీవితంలో చక్కగా నివసించడానికి ఏడు ఆధారాలు అవసరం. వాటిని ఏనుగడ అని వ్యవహరిస్తారు. ఆ ఏడు ఆధారాలు - 1.గురువు 2.తల్లి 3.తండ్రి 4.పురుషుడు 5.విద్య 6.దైవము 7.దాత. వీరు సప్తప్రకార రక్షకులు.
శ్రీకృష్ణా, నీవు ఈ చరాచర ప్రపంచానికి, తండ్రివి, ఆచార్యుడవు. నీతో సమానుడుగాని, నీకంటె అధికుడు గాని లేడు. నీ ప్రభావం సాటిలేనిది.
ఆ పరమేశ్వరుడు భక్తునికి తల్లి దండ్రి మొదలైన ఏడుగడగా కనిపించడం, ఇతడు వారిని కాపాడుమని కోరడం సామాన్యమే. భగవంతుడు విశ్వరూపుడు. అందుచేతనే భక్తులు అతనని ఒక రూపంలో కాక పెక్కు రూపాల్లో స్తుతించి తరిస్తారు.
ఆరోగ్య శాస్త్రంలో చెప్పినట్లుగా, మానవుడు దశేంద్రియాలలు కలిగి, శీతవాతాతపముల చేత రోగగ్రస్తుడు కావడం స్వాభావికమే. మానసికమైన బాధ ఎంత కష్టాన్ని కలిగిస్తుందో, శరీర బాధ కూడా అంతటి క్లేశాన్ని కలిగిస్తుంది మానవునికి. అందుచేత దేహబాధా నివారణార్థమై రోగగ్రస్తుడైన వాడు వైద్యుని ఆశ్రయించక తప్పదు.