నేర్చుకుందాం

నేర్చుకుందాం( దాశరథి శతకం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ.కుక్షినజాండపంక్తులొనగూర్చి చరాచరజంతుకోటి సం
రక్షణచేయు తండ్రివి, పరంపర నీతనయుండనైననా
పక్షము నీవు గావలదె? పాపములెన్ని యొనర్చినన్, జగ
ద్రక్షక, కర్తనీవె కద, దాశరథీ కరుణాపయోనిధీ.

భావం: కుక్షి లోపల అంటే గర్భం లోపల బ్రహ్మాండ సమూహాలను పొందికగా పెట్టుకొని, చేతనములు, అచేతనాలు అయిన సకలప్రాణి సమూహాలను రక్షించు తండ్రివి నీవే కాబట్టి, తరతరములుగా, నీ కుమారుడనై ఉన్న నా పాలిట నీవు పక్షపాతివై ఉండవలె. నేను పాపాలను చేసినానని నన్ను విడువరాదు. ఎన్ని పాపాలు చేసినా, లోకమెల్లను రక్షించేవాడవే నీవే కాబట్టి, ఆ పని చేసేవాడవు నీవొక్కడివే కాబట్టి నీవే నన్ను కాపాడవలెను.

వ్యా: భగవంతుడైన వాసుదేవుడు అతని అవతార రూపమైన శ్రీరాముడు ఈ బ్రహ్మాండాన్ని, పదునాల్గు లోకాలను, తన కుక్షిలో ఇముడ్చుకొన్నాడు. ఈ లోకాలు ఆయన గర్భంలో నుండి వెలువడినాయి. కాబట్టి ఈ లోకాలకు, బ్రహ్మాండానికి ఆయన తండ్రియేకదా. లోకాలను, వాటిలోని ప్రాణులను సృష్టి చేసిన భగవానుడు, మనుష్యమాత్రులందరికి తండ్రి వంటివాడు. ఈ మనుజులు ఆయన కుమారులు. మనుజుడైన కవి కూడ ఈ భగవానుని కుమారుడే. భక్తులందరు ఆయన కుమారులే. ఈ ప్రపంచం అనేక విధాల వ్యామోహాలకు, ఆశలకు, మోహాలకు ఆలవాలమైనట్టిది.