నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ. జనవర, మీ కథాళి వినసైపక కర్ణములందు ఘంటికా
నినదవినోదముల్ సలుపు నీచునకున్ వరమిచ్చినావు, ని
న్ననయము నమ్మికొల్చిన మహాత్ములకేమి యొసంగెదో సనం
దననుత , మాకొసంగుమయ, దాశరథీ కరుణాపయోనిధీ!

భావం: ఓ రాజా! ఓ దశరథరామా! మీ కథలను వినడానికి సహించక తన చెవుల్లో ఘంటల ధ్వనియొక్క వేడుకలను సలుపు అల్పునికి, అధమునికి కోరిన వరమును నీవు ఇచ్చినావు. ఎల్లపుడు నిన్ను నమ్మి సేవించువారికి ఏమి ప్రసాదిస్తావో సందనుడనే ఋషి చేత కొనియాడబడిన వాడా! వారికిచ్చినట్లే మాకును ప్రసాదించవా!

వ్యాఖ్యానం: కవి శ్రీరాముని ఔదార్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. శ్రీరాముని కథలు, విష్ణుమూర్తి కథలు బహుపుణ్యాత్మకాలు. వాటిని విని తరించేవారు లోకంలో చాలామంది ఉన్నారు.
కాని కొందరు అల్పబుద్ధిగలవారు శ్రీరాముని కథలను విన నిచ్చగించరు. ఎవరైన భగవానుని కథాకీర్తనం చేస్తున్నప్పు ఆ పుణ్యవృత్తాంతాలు తమకు వినిపిస్తాయని కాబోలు గంటలు కొట్టించుకుని తాళాలు వేయించుకొని వాటి నాదం వలన ఆనందాన్ని పొంది వినోదిస్తుంటారు.
ఇంక వారికా పుణ్య కథావిశేషాలు తెలియవు. ఇటువంటి అజ్ఞానులు కూడా ఏదైనా ఆపద వచ్చినపుడు భగవానుని వేడుకోవడమో ఆయనను సందర్శించడమో జరుగుతుంది. అపుడు భగవంతుడు వారి వేడికోలును మన్నించి వారు కోరిన వరాలను ప్రసాదిస్తాడు. వారికి మోక్షం కూడా ప్రసాదిస్తాడు. నిన్నటిదాకా ఇతడు నన్నుప్రార్థించలేదు కదా ఇపుడు ప్రార్థించినంత మాత్రాన ఇతనిని నేను మన్నించాలా వద్దా అన్న ప్రసక్తి భగవంతునికి కలుగుదు. భగవంతుని దృష్టిలో ఎవరైనా ఒకటే అందరినీ రక్షించేవాడు భగవంతుడు అని కవి భావాన్ని వ్యక్తపరిచాడు.