నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. పాపములొందువేళ రణ పన్నగ భూత భయ జ్వరాదులం
దాపద నొందువేళ, భరతాగ్రజ, మిమ్ము భజించువారికిం
బ్రాపుగ నీవుఁ దమ్ముఁడిరు ప్రక్కియలం జని తద్విపత్తి సం
తాపము మాని; కాతురఁట దాశరథీ కరుణాపయోనిధీ

భావం: ఓ దశరథరామా! భరతుని అన్నయైనశ్రీరామా, పాపములు పొందునపుడు యుద్ధము, సర్పములు, భూతములు, జ్వరములు (తాపము-రోగము) మొదలైన వానిచేత ఆపద కలిగినప్పుడు నిన్ను సేవించేవారిని, కొలిచేవారిని సహాయము చేబోయినీవు, నీ తమ్ముడైన లక్ష్మణుడు రెండు ప్రక్కల నిలిచి వారి ఆపదలను పొగొట్టి రక్షింతువని లోకులు చెప్పుదురు. కాబట్టి నిన్ను సేవించు నన్ను కాపాడవా?

వ్యాఖ్యానం: కవి ఇక్కడ భగవచ్ఛక్తిని వర్ణించినాడు. భగవంతుడు ఆపద్బాంధవుడు. తనను సేవించేవారికి కొలిచే వారికి ఎటువంటి ఆపదలు కలిగినా తానే కాక తన తమ్ముడు వంటి వారిని కూడా ఆపదలో ఉన్నవారిని కాపాడటానికి ఆయత్తపరుస్తాడు. మానవుడు నిత్యకష్టజీవి. నిరతరం తన క్షుద్బాధను తీర్చుకోవడానికి చేసే పనుల వల్ల ఆపదల పాలౌతాడు. పూర్వజన్మ కర్మల వల్ల కూడా బాధలనుభవిస్తుంటాడు. అందుకే ఏ ఆపద వచ్చినా ఓ శ్రీరామ ప్రభూ! అని ఎలుగెత్తి తనను రక్షించుమని వేడుకుంటూ ఉంటాడు. తన్ను పిలిచిన పక్కక్షణమే వారి ఎదుటకువచ్చి వారిని కాపాడేదేవుడే శ్రీరాముడు. నీతో ఉన్న లక్ష్మణ, హనుమదాదులు కూడా ఆపదలను బాపడానికి వస్తారు కదా. ఆపద్బాంధవుడైనా ఓ రామా! నేను సైతం నీ దాసుడనే నన్ను కాపాడడానికి నీవు తప్పక వస్తావు కదా అని కవి ప్రార్థిస్తున్నాడు.