నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

48. పరధనముల్ హరించి, పరభామలనంటి, పరాన్నమబ్బినన్
మురిపము కాని, మీఁదనగు మొస మెరుంగదు మానసంబు, దు
స్తరమిది, కాలకింకర గదాహతి పాల్పడనీక, మమ్ము నే
తరి దరిఁ జేర్చి కాచెదవో?దాశరథీ కరుణాపయోనిధీ!

భావం: దశరథరామా! పరుల ధనాన్ని దొంగలించడం, పరస్ర్తిలతో సంపర్కం చేయడం , ఇతరులు కష్టపడి సంపాదించిన ఆహారాన్ని తినడం, మొదట సుఖంగా ఉండినప్పటికి తరువాత నరకాన్ని కలిగిస్తుంది. యమదూతల గదాహతులకు గురి చేస్తుంది. ఇది మనసుకు తెలియదు. మనస్సును జయించడం కష్టం కాబట్టి మనస్సు ప్రేరేపించిన దారిలో వెళ్లి , నరకంలో బడకుండేటట్లు మమ్ము ఎప్పుడు కడతేర్చి కాపాడుతావో అంటే కాపాడుతాడు అని భావం.

వ్యాఖ్యానం:- అరిషడ్వర్గానికి లోనైన వాడు చేసే పనులను ఉటంకిస్తూ పరధనముల్ హరించడం , పరుల సొమ్ముకు ఆశపడడం, ఇతరులు పరిశమ్రించి సంపాదించిన దాన్ని దొంగలించడం లేదా దౌర్జన్యపూరితంగా లాక్కొని అనుభవించడం లాంటివి చేస్తే ఆ పనులు చాలా సుఖంగా ఉన్నట్టుగా కనిపిస్తాయి. కానీ చివరకు అవి పాపాలై నరకకూపానికి చేరుస్తాయి. సుఖలాలసతో పాపాలను చేసి సుఖం పొందుదామనే మనసు పెడదారిని పట్టిస్తుంది. ఆ మనసును నియంత్రిచడం నా వల్ల అయ్యే పనికాదు. కనుక ఓ శ్రీరామ! నేను నిన్ను నమ్మాను. అంతే కనుక నీవే నన్ను ఎల్లవేళలా పెడదారి పట్టకుండా కాపాడుము అని కవి ప్రార్థిస్తున్నాడు. ఒక్క కవే కాదు మనసును నియంత్రించుకోలేని భక్తులంతా శ్రీరాముడిని ఇదే విధంగా కాపాడాలి కదా.