నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. చేసితి ఘోరకృత్యములు చేసితి భాగవతాపచారముల్
చేసితి నన్యదైవములఁ జేరి భజించిన వారి పొందు నేఁ
జేసిన నేరముల్ దలచి చిక్కులు బెట్టకు మయ్య, యయ్య నీ
దాసుఁడనయ్య భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!

భావం: దశరథరామా! నేను భయంకరమైన పనులు చేసినాను. భగవద్బక్తులైన నీ భక్తులకు , భాగవతులకు అపకారాలు చేసినాను. దోషాలు చాలానే చేసినాను. విష్ణుమూర్తి కి భిన్నమైన దైవములను కొలుచువారితో సహవాసం చేసినాను. ఈ అపరాధాలనన్నింటిని నేను ఆచరించినాను. నా తప్పులను తలచి, నన్ను సంకటములలో పెట్టవలదు. నేను నీ సేవ చేసే దాసుడను. నన్ను మన్నించుము.

వ్యాఖ్యానం: భగవంతుడు తనకు చేసిన అపకారాన్ని సహిస్తాడు. కానీ తన భక్తులైన భాగవతులకు అపకారం చేస్తే తట్టుకోలేడు. అటువంటి పని ని కూడా నేను తెలియక చేసినాను. అందుకని నీవు నాపై క్రోథము పెట్టుకోకు. ఇపుడు నేను నీ నామ మహిమను తెలుసుకొన్నాను. కానీ ఇంతకుముందు కాలంలో నేను భాగవతులకు అపకారం చేసేవాడను, సర్వవ్యాపివి అయిన నిన్ను వదిలి నేను అన్యప్రార్థనలు చేసినాను. కనుక నన్ను దోషినని తలపక నీవే నన్ను నా మనసును మార్చి నన్ను నీవానిగా చేసుకొంటూ నేను సదా నీనామాన్ని ఉచ్చరించేట్టుగా చేయమని కవి ప్రార్థిస్తున్నాడు. సర్వమూ భగవంతుడే అని తలచినపుడు నేను అనే పదార్థమే ఉండదు కనుక భగవంతుడివైన నీవే నన్ను మలుచుకో నాచేత పుణ్యకార్యాలు చేయించు అని ప్రార్థించడం అంటే భక్తుడు నిమిత్తమాత్రుడినని, సర్వమూ భగవంతుడే నని నమ్మడమే.