నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. క్రోధమ తపముంజెఱచును
గ్రోధమ యణిమాదులైన గుణములఁబాపుం
గ్రోధమ ధర్మక్రియలకు
బాధయగుం గ్రోధిగాఁ దపస్వికిఁ జనే్న?
భావం: శమీకుడు కనులు తెరిచి చూచేసరికి ఎదురుగా కన్నీటితో నిలవబడిన కుమారుడు తన తండ్రి గొప్పతపస్సును వీడి కనులు తెరిచాడని అర్థం చేసుకొని కన్నీళ్లతో నమస్కరించి తండ్రీ అంటూ జరిగిన విషయాన్నంతా ఎరుకపర్చాడు. పైగా తాను ఏవిధంగా పరీక్షిత్తుకు శాపం ఇచ్చాడో కూడా తెలియబర్చాడు. అపుడు అదంతావిన్న శమీకుడు ఇలా అంటున్నాడు
‘నాయనా! కోపమే తపస్సును చెడగొడుతుంది. కోపమే అణిమ లఘిమ మొదలైన అష్టసిద్ధులను పోగొడుతుంది. కోపమే ధర్మంతో కూడిన కార్యాలకు బాధ కలిగిస్తుంది. కావున తపస్సు చేసే మునికి కోపం కలవాడుగా ఉండడం తగునా. నీవీ పని ఏవిధంగా ఆచరించావు. నీకు ఇంతటి కోపం ఎందుకు అని అడిగాడు. మహాత్ములకు చెడు చేసినా చేసినవారిపట్ల సైతం కల్యాణకరంగానే ఆలోచిస్తారని లోకక్షేమానికే వారు తపిస్తారని దీనిని బట్టి తెలుస్తుంది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము