నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాశరథి శతకం
*
ఉ. వారిచరావతారమున వారధిలోఁ జొరఁ బారి క్రోధవి
స్తారగుఁడైన యా నిగమ తస్కరవీరనిశాచరేంద్రునిన్
జేరి వధించి వేదముల చిక్కెడలించి విరించికిన్ మహో
దారత నిచ్చితీవె కద, దాశరథీ కరుణాపయోనిధీ!
*
భావం: దశరథరామా! మత్స్యావతారంలో సముద్రంలో వేగంగా ప్రవేశించి అధికమైన కోపావేశం కలిగినవాడై వేదాలను అపహరించుకొని వెళ్లిన వీరుడైన మేటి రాక్షసుడగు సోమకాసురుని పట్టి చంపి, వేదములకు కలిగిన ప్రమాదమును, చికాకును తొలగించి , బ్రహ్మకు మరల వానిని చాలా ఔదార్యం తో ఇచ్చిన వాడవు నీవే కాని మరెవ్వరు కాదు. ఓ రామా! మత్య్సావతారం ఎత్తిన విష్ణుమూర్తివి నీవే సుమా!
*
వ్యాఖ్యానం: ఈ పద్యంలో శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం వహించి వేదాలను ఉద్ధరించిన వృత్తాంతాన్ని పేర్కొంటున్నాడు కవి. లోకంలో విజ్ఞానం వెలుగు వంటిది. దానికి విఘాతం కలిగితే లోకం అంధకారబంధురం అవుతుంది. లోకానికి ఏ ప్రమాదం కలిగినా రక్షించే బాధ్యత భగవానునిదే. కాబట్టి రాక్షసుని వలన విజ్ఞాన ఖనియైన వేదాలకు భంగం కలిగితే వాటికి ప్రమాదం కలుగకుండా రక్షించి, తిరిగి సృష్టికర్తకు వాటిని అప్పగించిన భగవానుడే విష్ణుమూర్తి. ఏవిధమైన కష్టాలు వచ్చినా అది భక్తుడికైనా, సృష్టికి యైనా దాని నుంచి రక్షించే వాడే భగవానుడు. ఆ భగవానుడినే విష్ణుమూర్తిగా భావిస్తాం.