నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాశరథి శతకం
*
ఉ. ధారుణిఁ జాపఁ జుట్టిన విధంబునఁ గైకొని హేమనేత్రుఁడ
వ్వారిధిలోన దాగినను, వాని వధించి వరాహమూర్తివై
ధారుణిఁ దొంటికైవడిని దక్షిణ శృంగమునన్ ధరించి, వి
స్తారమొనర్చితీవె కద, దాశరథీ కరుణాపయోనిధీ!
*
భావం: దశరథరామా! హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూమిని చాప గా చుట్టి ఎత్తుకుని సముద్రంలోనికి వెళ్లి దాచుకొనగా నీవు వానిని సంహరించి వరాహ రూపాన్ని ధరించి కుడిపంటికోరతో భూమిని ఎత్తుకొని వచ్చి మునుపటి వలె చాపగా వెడల్పుగా పరపునొందునట్లు చేసినవాడవుకదా. ఈ పనిని చేయగల సమర్థులు నీవే కాని మరెవ్వరు కారు.
వ్యాఖ్యానం: ఈ పద్యంలో శ్రీమన్నారాయణుని మూడవ అవతార విషయ ప్రస్తావన ఉన్నది. విష్ణుమూర్తి వైకుంఠంలో నివసించేవాడు. అతనికి ద్వారపాలకులు జయవిజయులు. ఒక సందర్భంలో సకనసనందనులు అనే విష్ణ్భుక్తులు వచ్చి వైకుంఠంలోపలికి వెళ్లబోగా జయవిజయులు వారిని అహంకారంతో అవమానించారు. సనకసనందనులు కోపగించి వారిని శపించారు. వారి శాప ఫలితంగా జయవిజయులే హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించారు. వీరి జన్మ వరాహ కల్పంలో సంభవించింది. స్వయంగా జయవిజయులే విష్ణ్భుక్తులు కాని శాపం వల్ల వారు లోకభయంకరులుగా మారారు. వారిని ఉద్దరించడానికి, వారివల్ల బాధపడే సజ్జనులను రక్షించి లోకోపకారం చేయడానికి వరాహరూపాన్ని, నరసింహ రూపాన్ని విష్ణుమూర్తి దాల్చారు.