నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. సంకరదుర్గమై దురిత సంకులమైన జగంబుఁ జూచి స
ర్వం కషలీల నుత్తమ తురంగము నెక్కి కరాసి ఁబూని నీ
రాంక విలాస మొప్ప ఁ కలిగాకృతి సజ్జన కోటికిన్ నిరా
తంక మొనర్చి తీవె కద! దాశరథీ కరుణాపయోనిధీ!

భావం: దశరథరామా! వర్ణసాంకర్యము చాలా బలీయమై పాపాలు దట్టంగా వ్యాపించి ఉన్న జగమును చూసి అంతటా వ్యాపించిన భగవానుని విలాసముతో గొప్ప మేలైన అశ్వాన్ని అధిరోహించి చేత కత్తిబట్టుకొని , వీరునికి తగినట్టి సత్య పరాక్రమమే నీ విలాసము కాగా, కల్కి మ ఊర్తివై సజ్జనులకు మంచి పనులలో ఆటంకము, కష్టము లేకుండునట్లు నిర్వహించేవాడవు నీవే కదా.

వ్యాఖ్యానం: కంచెర్లగోపన్న కవి ఈ పద్యంలో కల్కి అవతారాన్ని వర్ణిచినాడు. భగవద్గీతలో సంభవామి యుగే యుగే అని భగవానుడు ఉద్ఘాటించినాడు. కాబట్టి కలియుగంల కలి ప్రబలినప్పుడు కల్కి అవతారంగా శ్రీమన్నారాయణుడు అవతరించవలసిందే. ఈ దుష్కృత్యాలను నిర్మూలించవలసిందే. అపుడు తిరిగి సత్యయుగం ప్రారంభమవు తుంది. చెడు అట్టహాసంగా కనిపించినా ఆర్భాటంగా కనిపించినా చివరకు అది భగవంతుని చేతిలో పరాజయం పొందుతుంది. ఎప్పటికీ నిలిచి ఉండేది సత్యమొక్కటే.