నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ. ముదమున కాటపట్టు, భవమోహమదద్విరదాంకుశంబు సం
పదలకొటారు, కోరికల పంట, వరంబున కాది, వైరుల
న్నదన జయించు త్రోవ , విపబ్దికి నావ గదా సదా భవ
త్పదమల నామ సంస్కరణ దాశరథీ కరుణాపయోనిధీ!

భావం: దశరథరామా! నిర్మలమైన నీ నామాన్ని స్మరించడం సంతోషాన్ని కలిగిస్తుంది. అంకుశము అనే సాధనము ఏనుగును అణచినట్లుగా జన్మంలో కలిగే వ్యామోహాన్ని అణచివేస్తుంది. అన్ని సంపదలను సమకూరుస్తుంది. అన్ని కోరికలను తీరుస్తుంది. మోక్షమును కల్గిస్తుంది. పగవారిని గెలువడానికి సాధనము. సముద్రాన్ని దాటించు ఓడ వలె కష్టాలను దాటిస్తుంది.

వ్యాఖ్యానం: భక్తి మార్గం చేత లౌకిక మైనట్ట్టి పారలౌకిక మైనట్టి మనుజుని సమస్యలన్ని తీరిపోవును. అని కవి ప్రతిపాదించినాడీ పద్యంలో. శ్రీరాముని భర్తగా నమ్మి దైవంగా భావించి సేవించిన మహా సాధ్వి సీతాదేవి. రావణుడు ఆమెను అపహరించిన క్షణం నుంచి రామనామస్మరణ చేస్తునే ఉంది. ఆ నామ మాహాత్మ్యకారణంగానే హనుమంతునికి ఆమె కనిపించడం, వానర సైన్యం లంకానగరం పై దండెత్తడం, రావణ సంహారం సీతాదేవిని ముక్తి జరిగినాయి. ఇదంతా రామనామ స్మరణ మహిమగానే భావించాల్సి ఉంటుంది.