నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ. చిరతర భక్తి నొక్క తులసీ దళ మర్పణ సేయువాఁడు ఖే
చరగరుడోరప్రముఖ సంఘములో వెలుఁగన్ సదా భవత్
స్ఫుర దర వింద పాదములఁ బూజ లొనర్చినవారికెల్లఁ ద
త్పరమ రచేత ధాత్రి గద దాశరథీ కరుణాపయోనిధీ!

భావం: దశరథ రామా! బహుకాలం నుండి భక్తి తో ఒక్క తులసీ దళమును నీకు సమర్పించినవాడు ఖేచరులు, గరుడులు, ఉరగులు అనే దేవతలలో చేరి వారిలో ఒక్కడై ప్రకాశిస్తాడు. ఇక ఎల్లప్పుడు పద్మముల వంటి నీ పాదాలను పూజ చేసిన వారికందరికీ మోక్షము. చేతిలో ఉసిరిక వలె అతి సులభం కదా.

వ్యాఖ్యానం: తులసీ దళం చాలా సులభంగా లభించే ఓషధి. భక్తితో ఎవరైనా దానిని భగవంతునికి సమర్పణ చేస్తే అతనికి అతడు దేవతల పదవిని సమకూరుస్తాడు. హరివంశంలో చెప్పబడిన కథలో శ్రీకృష్ణుని భార్యయైన సత్యభామ తన ధనధాన్యాలు, సమస్త ఐశ్వర్యాలను వెచ్చించి శ్రీకృష్ణుని తులాభారంతాను కొనుక్కొంటానని అనుకొంటుం ది. కానీ సత్యభామలోని అజ్ఞానం, అహంకారం చూసిన కృష్ణుడు ఆమె పసిడికి తూగలేదు. కానీ భక్త్భివంతో రుక్మిణి ఒక్క తులసీదళాన్ని శ్రీకృష్ణుడిని తూచే తులాభారంలో వేయగానే తులసీదళానికి కృష్ణుని బరువు సమానమవుతుంది. ఇక్కడ కృష్ణుడు నేను ఎవరికైనా అలభ్యుడనే. కానీ భక్తి అన్న పదార్థానికి నేను లొంగిపోతాను. భక్తి కలవారికి నేను సదా అందుబాటులో ఉంటాను అని చెబుతున్నాడు.