నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ.
నీ మహనీయ తత్త్వ రస నిర్ణయ బోధ కథామృతాబ్ధిలో
దానును గ్రుంకులాడక వృథా తనుకష్టముఁ జెంది మానవుం
డీ మహిలోకతీర్థముల నెల్ల మునింగిన దుర్వికారహృ
త్తామస సంకముల్ విడునె ? దాశరథీ కరుణాపయోనిధీ

భావం: దశరథ రామా ! నీ గొప్పతనం యొక్క సారస్య మిట్టిదని నిర్ణయించి తెలిపే నీ దివ్య చరిత్రమనే అమృత సముద్రంలో గ్రుంకు లిడినప్పుడు దుర్వికారమైన హృదయము నందలి తామసమనెడి మాలిన్యములు తొలిగిపోవును. కాని కేవలం ఈ లోకంలోని నదీ నదముల నుండి తీర్థములలో శరీరాన్ని కష్టపెట్టుకొని మునిగి నప్పుడు మనస్సులోని తామస భావాలు తొలగిపోవునా తొలిగిపోవును.

వ్యాఖ్యానం: భక్తుడు నవ విధ భక్తుల్లో ఒకటియైన శ్రీమన్నారాయణుని కథా సంకీర్తనం చేయవచ్చు. ఆయన కథలు అమృతం తో కూడిన సముద్రం వంటివి . ఆ కథలు చదివితే అమృత సముద్రంలో స్నానం చేసినన పుణ్యం లభిస్తుంది. దాని వలన భగవత్ తత్త్వబో నిర్ణయాత్మకంగా తెలియవస్తుంది. దాని వల్ల మోక్షం లభిస్తుంది. నదీ నదాలు పుణ్య తీర్‌థములుగా భావించడం ఉన్నది. మనస్సులోని మాలిన్యం పోవడం ఎట్లా సాధ్యమవుతుంది అంటే నారాయణుని అమృత కథాగానం గ్రోలాలి. ఆ కథా సముద్రంలో గ్రుంకులిడినప్పుడు ఆ కథాసంకీర్తనం చేసినపుడు మనస్సులోని అజ్ఞానం తొలిగిపోతుంది.