నేర్చుకుందాం

శివనామాలు (తేటగీతి సుమాలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1.
ఓం వృషభారూఢాయ నమః
ఇల చరాచరములు తుదకేమి యగునొ
అదియె భస్మము ; శాశ్వత మైన దాత్మ
అందుకేమొ? ‘్భస్మోద్ధూళితాంగ విగ్ఘ్ర
హుడ’ను సార్థకనాముడై యుడు భవుడు

2. ఓం సామప్రియాయ నమః
తకిట తద్దిమితల తోడ తాండవమును
సాంబశివుడై ప్రదోషాన సలుపుచుండు
సామవేదమ్ము వినిన ప్రసన్నుడగును
కనుక ‘సామప్రియుండ’న్న ఖ్యాతి కలిగి
3. ఓం స్వరమయాయ నమః
ప్రణవ నాద స్వరూపుడు పరమశివుడు
అ ఉ మ కారత్రయానకి అతడె శక్తి
ముగ్గురైన పరబ్రహ్మ మూర్తి ఒకడె
ఓం ‘సర్వమయుండు’ జ్ఞాన మయుని
నుతింతు
4. ఓం త్రరుూమూర్తయే నమః
ఋగ్యజుస్సామ వేద సంస్కృతి విభుండు
దేవతారాధనా పద్ధతిని లిఖించి
లోకులు నుతింప మంత్రాలు శ్లోకములును
దానమిడిన ‘త్రరుూమూర్తి’ తలతు నతము

కడియాల మధుసూదన రావు 9030907191