నేర్చుకుందాం

శివనామాలు (తేటగీతి సుమాలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

5. ఓం అనీశ్వరాయ నమః
ఈ చతుర్దశ భువనాల నేలువాడు
సార్వభౌమత్వమున తన సాటిలేరు
ప్రభువుగా మరొక్క డతని పైనలేరు
అందుకే‘అనీశ్వరుడ’య్యె అంజలిదియె

6. ఓం సర్వజ్ఞాయ నమః
జరిగినది జరిగెడునది జరుగనున్న
దంత తెలిసిన ఆదిమధ్యాంత రహిత
మూర్తి , మన మనస్సుల భావములను చదువు
గురుడు ‘సర్వజ్ఞ’ భవునకు కోటి నుతులు

7. ఓం పరమాత్మాయ నమః
ప్రాణుల సృజింప నియమించె బ్రహ్మ నెవడు
జీవులన్నియు చేరెడి చివరి మజిలి
అంతటా నిండియున్నట్టి అంతరాత్మ
ఆయనే ‘పరమాత్ము’ సర్వాత్ము దరితు

8. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః
సృష్టి చేయుడటై సూర్యదృష్టి ఒకటి
కళలతో ఓషధులొసంగు కన్ను శశియు,
చెడును కాల్చు మూడవ కన్ను శివుడు - పొందె
‘సోమసూర్యాగ్ని లోచన’ నామ మట్లు

కడియాల మధుసూదన రావు.. 9030907191